కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. అయితే ఆ పార్టీ అధికారం చేపడితే సీఎంగా ఎవరు ఉంటారనే విషయంపైనే అంతటా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థులుగా డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
కర్ణాటకలో ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. ఇదే ఒరవడి చివరిదాకా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగుతుంది. ప్రస్తుతం వరకు ఉన్న ట్రెండ్ తో దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు సంబంరాలు జరుపుపుకుంటున్నారు. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతున్నా.. సీఎం ఎవరనేది మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇందులో సిద్దరామయ్య గతంలో కర్ణాటకకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. డీకే శివకుమార్ కూడా పార్టీలో ఎంతో కాలం నుంచి పని చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.
ఓటమిని అంగీకరించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. ‘చాలా ప్రయత్నించాం కానీ..’
ఈ ఎన్నికలకు ముందే 75 ఏళ్ల సిద్ధరామయ్య ఇదే తన చివరి ఎన్నికలు అని ప్రకటించారు. కాంగ్రెస్ 120కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆయన అప్పుడే జోస్యం చెప్పారు. కాగా.. కర్ణాటక భవిష్యత్ కోసమే తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు ఆయన కుమారుడు యతీంద్ర సిద్దరామయ్య శనివారం ఉదయం వ్యాఖ్యానించారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు తాము ఏమైనా చేస్తామని చెప్పారు.
‘‘ఒక కొడుకుగా ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను. ఒక రాష్ట్ర వాసిగా ఆయన గత పాలనలో సుపరిపాలన కనిపించింది. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే బీజేపీ పాలనలోని అవినీతిని, దుర్మార్గపు పాలనను సరిదిద్దుతారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన ముఖ్యమంత్రి కావాలి’’ అని యతీంద్ర తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్.. వెనుకంజలో ఐదుగురు మంత్రులు..ఎవరెవరంటే?
డిప్యూటీ సీఎం, సీఎంగా పని చేసిన సిద్ధరామయ్య..
సిద్ధరామయ్య 1983లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994లో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదేళ్ల తరువాత అంటే 2004 లో జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వంలో ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో కూడా ఆయన చేరారు. కాగా.. జేడీయూ నాయకుడు హెచ్ డీ దేవెగౌడతో విభేదాల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. రెండేళ్ల తర్వాత 2008లో సిద్దరామయ్య కాంగ్రెస్ లో చేరాడు. 2013 కర్ణాటక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్
సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య ప్రత్యర్థి గా ఉన్న డీకే శివకుమార్ కు ప్రస్తుతం 61 సంవత్సరాలు. ఆయన కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన సీనియర్ నాయకుడు. కర్ణాటకలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరుగా ఉన్నారు. 2019లో కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమైనప్పటికీ ఆయన ప్రాముఖ్యత పెరిగింది.
ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ బీజేపీ ఆఫీసులో పాము కలకలం.. సీఎం ఉండగానే గందరగోళ పరిస్థితి.. (వీడియో)
అయితే సిద్దరామయ్య మాదిరిగా కాకుండా శివకుమార్ 1989లో తొలి ఎన్నికల విజయం సాధించినప్పటి నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. పలు అవినీతి కేసులను ఎదుర్కొంటున్న శివకుమార్ కు బెయిల్ రాకముందు తీహార్ జైలులో కూడా గడిపారు. కాగా.. ఈ ఇద్దరూ ప్రస్తుతం కాంగ్రెస్ లో బలమైన మద్దతు ఉన్న నాయకులు. అయితే వీరిలో సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయం కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసరబోతోంది.
