Asianet News TeluguAsianet News Telugu

కొత్త పార్లమెంటును ప్రశంసించిన షారుఖ్ ఖాన్ పై కాంగ్రెస్ ఫైర్.. ఇక ‘కింగ్’ లేరంటూ విమర్శలు..

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పార్లమెంట్ కొత్త భవానాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు పెట్టారు. ఈ ప్రశంసలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంక ‘కింగ్’ లేరు అంటూ విమర్శలు చేసింది. 

Congress fire on Shah Rukh Khan who praised the new parliament.  Criticism that there is no more 'King'..ISR
Author
First Published May 28, 2023, 11:59 AM IST

కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీల బహిష్కరణ మధ్య చారిత్రాత్మక ఘట్టంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి ఆదివారం అంకితం చేశారు. లోక్ సభలో స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రధాని మోడీ పవిత్ర సెంగోల్ ను ఏర్పాటు చేశారు. కొత్త పార్లమెంట్ భవనంపై దేశ వ్యాప్తంగా నేతలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా కొత్త పార్లమెంటు గొప్పతనాన్ని ప్రశంసించారు. అయితే ఆయన పొగడ్తలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పన్నెండేళ్ల బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చి, బిడ్డను ప్రసవించిన బాధితురాలు.. ఎక్కడంటే ?

కష్టకాలంలో నటుడికి అండగా నిలిచిన వ్యక్తులను 'కింగ్ ఖాన్' చిన్నచూపు చూస్తున్నాడని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ సోషల్ మీడియా చీఫ్ పంఖురి పాఠక్ ఆరోపించారు.  ‘మీ కొడుకును తప్పుగా టార్గెట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, మీ సినిమాలకు వ్యతిరేకంగా బహిష్కరణ పిలుపులు ఇచ్చినప్పుడు, మీ మతం కారణంగా మిమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు.. మీకు అండగా నిలిచిన చాలా మందిని మీరు వదిలేశారు. వారు మీకు చేసిన దానికి మీరు అర్హులే అని ఇది గట్టిగా, స్పష్టంగా చెబుతుంది. క్షమించండి, కానీ ఇక మీరు రాజు కాదు. ఇక లేరు’ అని కొత్త పార్లమెంటును ప్రశంసిస్తూ షారుఖ్ ఖాన్ షేర్ చేసిన వీడియోను ఆమె రీట్వీట్ చేశారు.

ఘోరం.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తోందని.. భార్యపై వేడి సాంబార్ పోసిన భర్త..

ఇంతకీ షారుఖ్ ఖాన్ ఏమన్నాడంటే ?
పార్లమెంట్ కొత్త భవనాన్ని షారుఖ్ ఖాన్ ఓ ట్వీట్ లో ప్రశంసించారు. ‘‘రాజ్యాంగాన్ని నిలబెట్టే, భారతదేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహించే, భిన్నత్వాన్ని పరిరక్షించే ప్రజలకు ఇది అద్భుతమైన కొత్త ఇళ్లు. నవ భారతావని కోసం కొత్త పార్లమెంటు భవనం. జై హింద్! #MyParliamentMyPride’’ అని ఆయన ట్వీట్ చేశాడు. 

ఆయన ట్వీట్ చేసిన ఓ వీడియాలో షారుఖ్ ఖాన్ కొత్త పార్లమెంటు భవనం ప్రాముఖ్యతను వివరించారు. ‘‘శరీరానికి ఆత్మ ఎలానో పార్లమెంటు దేశానికి అలాంటదని చెబుతారు. మన ప్రజాస్వామ్య ఆత్మ దాని కొత్త ఇంటిలో దృఢంగా ఉండాలని, రాబోయే తరాలకు స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వాన్ని పెంపొందించడం కొనసాగించాలని నా హృదయపూర్వక ప్రార్థన’’ అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త 'ప్రజాస్వామ్య నివాసం' శాస్త్రీయ దృక్పథానికి, అందరి పట్ల సహానుభూతికి ప్రసిద్ధి చెందిన కొత్త యుగాన్ని నిర్మిస్తుందని షారుఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. షారుఖ్ ఖాన్ చేసిన ఈ ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోడీ కూడా రీ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios