ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని సూచించింది. రాష్ట్రాల రాజధానుల్లో పీసీసీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడించనున్నారు

ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఏఐసీసీ (aicc) . రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ భవన్ వరకు ఆందోళలనకు కాంగ్రెస్ (congress) కార్యాచరణ ప్రకటించింది. జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని సూచించింది. రాష్ట్రాల రాజధానుల్లో పీసీసీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడించనున్నారు. ఇక ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ సభ్యులు, జాతీయ నాయకులు పాల్గొంటారు. 

ఇకపోతే.. గుజరాత్‌లో క‌ల్తీ మద్యం అమ్మకాల వ్యవహారం హాట్ హాట్‌గా మారింది. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయంగా మారింది. మోడీ స్వ‌రాష్ట్రంలోని బొటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోయారు. ఈ విష‌యంలో గుజరాత్ ప్రభుత్వాన్నిప్రతిపక్షనేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం తాగి ..చాలా మంది రోడ్డున ప‌డ్డార‌ని మండిప‌డ్డారు. గుజ‌రాత్ లో మ‌ద్య నిషేధం చేశామ‌ని ప్ర‌క‌టించిన‌.. అమ‌లు చేయ‌డంలో బీజేపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, రాష్ట్రంలో వేలకోట్ల విలువైన డ్రగ్స్ రికవరీ అవుతున్నాయని అన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమ‌ని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ డీలర్లను కాపాడేందుకు పాలక శక్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ఆరోపించారు.

ALso Read:తప్పు పదం వాడాను.. క్షమించండి : ‘‘రాష్ట్రపత్ని’’ వ్యాఖ్యలపై ద్రౌపది ముర్ముకు అధిర్ రంజన్ లేఖ

రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, సంపూర్ణ మ‌ద్య నిషేదిత రాష్ట్రమైన గుజరాత్‌లో నకిలీ మద్యం తాగి.. చాలా మంది తన జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. వేలకోట్ల విలువైన డ్రగ్స్ నిరంతరం రికవరీ అవుతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. జాతి పిత, సర్దార్‌ పటేల్‌లు న‌డిచిన నేల‌పై విచక్షణారహితంగా డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరు? ఈ మాఫియాలకు ఏ పాలక శక్తులు రక్షణ కల్పిస్తున్నాయి? అని ట్విట్ చేశారు. 

వాస్తవానికి గుజరాత్‌లో మద్య నిషేధం అమలులో ఉంది, అటువంటి పరిస్థితిలో, కల్తీ మద్యం తాగడం వల్ల 42 మంది అమాయ‌కులు మరణించిన అంశం ప్రతిపక్షాలను విమ‌ర్శాస్త్రంగా మారింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.