Asianet News TeluguAsianet News Telugu

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కు కాంస్యం..

Weightlifter Harjinder Kaur: మహిళల వెయిట్ లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొత్తం 212కిలోల బరువు (స్నాచ్‌లో 93, క్లీన్ అండ్ జెర్క్‌లో 119) ఎత్తింది. 
 

Commonwealth Games 2022 Day 4 Updates: Weightlifter Harjinder Kaur Wins Bronze
Author
Hyderabad, First Published Aug 2, 2022, 6:08 AM IST

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో 4వ రోజు మహిళల 71 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి హర్జిందర్ కౌర్ కాంస్య ప‌త‌కం సాధించింది. హర్జిందర్ మొత్తం 212 కిలోలు (స్నాచ్‌లో 93 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కిలోలు) ఎత్తి మూడో స్థానంలో నిలిచారు. కెనడాకు చెందిన అలెక్సిస్ అష్‌వర్త్ మొత్తం 214 కిలోల బరువుతో రజతం గెలుచుకోగా, ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ మొత్తం 229 కిలోల బరువు ఎత్తి స్వర్ణం గెలుచుకుంది. 

కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగ‌వ రోజు భార‌త ఫ‌లితాలు ఇలా ఉన్నాయి.. జూడోకా సుశీలా దేవి 4వ రోజున రజత పతకాన్ని సాధించి ఖాతా తెరిచింది. మహిళల 48 కేజీల ఫైనల్స్ లో ఆమె ఫీట్ సాధించిన వెంటనే, జూడోకా విజయ్ యాదవ్ పురుషుల 60 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని ఖాయం చేశాడు. మహిళల 71 కేజీల ఫైనల్స్‌లో వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 4వ రోజు భారత్ సాధించిన మూడు పతకాలతో  కామన్వెల్త్ గేమ్స్ 2022లో మొత్తం ప‌త‌కాల సంఖ్య 9కి పెరిగింది. అందులో మూడు బంగారు ప‌థ‌కాలు, మూడు సిల్వ‌ర్, మూడు బ్రాంజ్ మెడ‌ల్స్ ఉన్నాయి. మిక్స్‌డ్-టీమ్ ఈవెంట్‌లో షట్లర్లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇందులో పివి సింధు, లక్ష్య సేన్ ఇద్దరూ తమ సింగిల్ మ్యాచ్‌లలో విజయం సాధించారు. పురుషుల టేబుల్-టెన్నిస్ జట్టు నైజీరియాను ఓడించి ఫైనల్స్‌లో బెర్త్ ఖాయం చేసుకుంది.  అక్కడ వారు బంగారు పతక పోరులో సింగపూర్‌తో తలపడతారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఈవెంట్‌లో సౌరవ్ ఘోషల్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల లాన్ బౌల్స్ ప్లేయర్లు అంతకుముందు రోజు చరిత్ర సృష్టించారు.

బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్స్‌లో భారత్ 3-0తో సింగపూర్‌ను ఓడించింది. ఇప్పుడు స్వర్ణ పతక పోరులో మలేషియాతో తలపడనుంది. జూడోకా షుశీలా దేవి లిక్మాబామ్ మహిళల 48 కేజీల ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన మైఖెలా వైట్‌బూయ్‌తో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. మరోవైపు పురుషుల కేజీ జూడో విభాగంలో సైప్రస్‌కు చెందిన పెట్రోస్ క్రిస్టోడౌలిడ్స్‌ను ఓడించి విజయ్ కుమార్ యాదవ్ కాంస్యం సాధించాడు. అయితే పురుషుల 66 కేజీల జూడో ఈవెంట్‌లో జస్లీన్ సింగ్ సైనీ కాంస్య పతక పోరులో నాథన్ కాట్జ్ చేతిలో ఓడిపోయింది. మహిళల 57 కేజీల జూడో కాంస్య పతక పోరులో సుచికా తరియాల్ కూడా ఓటమిని చవిచూసింది. హాకీలో పురుషుల విభాగంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-4తో డ్రా చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios