ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ ప్రియుడి ఆత్మహత్య

Colcutta student ends life on video call with lover
Highlights

చిన్న వయసులో కలిగే ఆకర్షణలను ప్రేమగా భావించి నేటి యువతరం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ అనేది రెండు జీవితాలను నిలబెడుతుందే కానీ ప్రాణాలను బలి కోరదని గుర్తించలేక పోతున్నారు. ఇలా చిన్న వయసులోనే ఓ యువకుడు ప్రేమ పేరుతో  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్మీడియట్ చదివే ఓ విద్యార్థి తన ప్రేయసికి వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు చేసుకున్న ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.
 
ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కతకత్తాకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు ఓ అమ్మాయిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే వీరిద్దరి మద్య గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో సదరు యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో అతడు బుధవారం రాత్రి 12 గంటల సమయంలో యువతికి వీడియో కాల్ చేశాడు. అప్పుడు కూడా ఇద్దరి మద్యా తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో తట్టుకోలేక పోయిన యువకుడు అలాగే వీడియో కాల్ మాట్లాడుతూ తన గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువతి ఎంత చెప్పినా వినకుండా ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ఈ వీడియో కాల్ ని కట్ చేసిన యువతి ఈ విషయాన్ని యువకుడి ఇంటివద్దే ఉండే ప్రెండ్ కి తెలియజేసింది. దీంతో అతడు వెళ్లి యువకుడి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. వారు యువకుడి రూం కి వెళ్లి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.

ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయే తమ కొడుకు మృతికి కారణమని, ఆమె వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader