రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇది మొదట ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న గొడవగా మొదలైంది. కొంత సమయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో కనీసం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారులు పలు వివరాలను వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఈ ఘర్షణ మొదలైందని చెప్పారు.
సుర్‌సాగర్‌లోని రాయల్టీ చెక్‌పాయింట్ సమీపంలోని రూపావటో కా బేరా వద్ద ఇరువర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ జరిగిన విధానం, అది పెరిగిన విధానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాళ్ల దాడి కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.ఈ దాడి ఘటనలో కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. పశ్చిమ బెంగాల్ లో ఘటన
ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం కారణంగా ప్రారంభమైన గొడవ.. కాసేపట్లోనే జనం గుమిగూడిగా పెద్దగా మారిపోయింది. దీంతో గొడవ మొదలైంది. ఈ ఘర్షణపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అక్కడ గుమిగూడిన గుంపును చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో జోద్ పూర్ ప్రాంతంలో మంగళవారం సెక్షన్ 144 విధించారు.భారీగా పోలీసు బలగాలను మోహరించారు కాగా గత నెలలో జోధ్‌పూర్‌లోని జలోరీ గేట్ వద్ద అక్షయ తృతీయ సందర్భంగా ఈ ప్రాంతంలో హింసాత్మక మత ఘర్షణలు చెలరేగాయి. బల్ముకంద్ బిస్సా సర్కిల్‌లో జెండా ఎగురవేయడంపై అభ్యంతరాలు రావడంతో ఘర్షణ మొదలైంది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
