మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రవాద సంస్థ అల్ ఖైదా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడుతామని హెచ్చరించింది. 

ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ల‌పై ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డుతామ‌ని ఉగ్ర‌వాద సంస్థ అల్ ఖైదా హెచ్చ‌రించింది. ఇటీవ‌ల కొంత మంది బీజేపీ నాయ‌కులు ముస్లిం ఆరాధ్యుడైన ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా వివాదం చెల‌రేగింది. వీటిపై అర‌బ్ దేశాలు కూడా మండిప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలోనే అల్ ఖైదా నుంచి ఈ హెచ్చ‌రిక వ‌చ్చింది. దీంతో ఒక్క సారిగా దేశంలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. 

ప‌ట్టాలు త‌ప్పిన ప్యాసింజ‌ర్ రైలు.. ప‌శ్చిమ బెంగాల్ లో ఘ‌ట‌న‌

‘‘ మా ప్రవక్తను కించపరిచేవారిని మేము చంపుతాం. మా ప్రవక్తను అవమానించడానికి ధైర్యం చేసే వారి ర్యాంక్‌లను పేల్చివేయడానికి మా శరీరాలతో, మా పిల్లల శరీరాలతో పేలుడు పదార్థాలను బంధిస్తాము. కాషాయ తీవ్రవాదులు ఇప్పుడు ఢిల్లీ, బొంబాయి, యూపీ, గుజరాత్ లో తమ అంతం కోసం వేచి ఉండాలి ’’ అని అల్ ఖైదా ఒక లేఖ విడుదల చేసింది. 

Scroll to load tweet…

మలేషియా, కువైట్, పాకిస్తాన్ వంటి అనేక దేశాలు ఇటీవల కొంతమంది బీజేపీ నాయ‌కులు ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను ఖండించాయి. నూపుర్ శర్మ ఓ టీవీ డిబేట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయగా, మరో నేత నవీన్ జిందాల్ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అభిప్రాయాలు కొన్ని అంచులకు మాత్రమే చెందినవని, అవి భారత ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించవని భారతదేశం వాదించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) భారత్ ను ‘‘అనవసరమైన, సంకుచిత మనస్తత్వం ’’ అని కొట్టిపారేసింది. కాగా ఈ ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ స్ప‌ష్టంగా తిర‌స్క‌రించింది. 

మహమ్మద్ ప్రవక్తపై మరో బీజేపీ నాయకుడి అభ్యంతరకర పోస్ట్.. అరెస్టు చేసిన పోలీసులు

బీజేపీ అధికార ప్ర‌తినిధి నూప‌ర్ శ‌ర్మ‌, ఢిల్లీ మీడియా ఇంచార్జ్ న‌వీన్ జిందాల్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వారిద్ద‌రినీ ఆ పార్టీ స‌స్పెండ్ చేసింది. తాము ఏ మ‌త వ్య‌క్తిత్వాన్ని అగౌరవపర్చ‌బోమ‌ని, త‌మ‌కు అన్ని మ‌తాలు ఒక‌టే అంటూ బీజేపీ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. అయితే తాజాగా టీవీ డిబేట్లలో నాయకులు పాటించాల్సిన నియమాలను బీజేపీ రూపొందించింది. ఈ చ‌ర్చ‌ల సంద‌ర్భంగా ఎవ‌రూ ఏ మ‌తాన్ని, ఏ మ‌తానికి చెందిన వ్య‌క్తినైనా విమ‌ర్శించ‌కూడ‌ద‌ని తెలిపింది. 

ఇద్దరు మాజీ మంత్రులపై అవినీతి కేసు.. చెట్లు కూల్చడానికి ఒకరు.. రక్షించడానికి ఇంకొకరు లంచాలు

చ‌ర్చ వాడీ వేడిగా జ‌రుగుతున్న‌ప్పుడు కూడా పార్టీ ప్రతినిధులు హద్దులు మీరవద్దని ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. అలాగే భాష ప‌ట్ల కూడా పార్టీ ప్రతినిధులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పేర్కొంది. చర్చలో పడి ఆవేశానికి లోను కావొద్దని, ఆందోళనకు దిగొద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఎవరు రెచ్చగొట్టినా.. వారి ట్రాప్‌లో పడొద్దని, పార్టీ భావజాలాన్ని, ఆదర్శాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని పార్టీ ప్రతినిధులకు తెలిపినట్టు పేర్కొంది. అలాగే టీవీలో చర్చించే టాపిక్ విష‌యంలో పార్టీ ప్రతినిధులు ముందస్తుగా తెలుసుకోవాలని, దానిపై చర్చకు సిద్ధం అయిన త‌రువాత‌నే పాల్గొనాల‌ని ఆదేశించింది.