పశ్చిమ బెంగాల్ లో ఓ ట్రైన్ పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. పలువురు స్పల్ప గాయాలతో బయటపడ్డారు.ఈ ఘటన వల్ల పలు రైళ్లు ఆలస్యం అయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో 30-40 మందితో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు మంగళవారం సాయంత్రం పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. అయితే రైలు పట్టాలు తప్పడంతో రెండు రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యమయ్యాయి.
అసన్‌సోల్ రైల్వే స్టేషన్ సమీపంలో అసన్ సోల్ -బొకారో MEMU రైలు కంపార్ట్‌మెంట్ యొక్క నాలుగు చక్రాలు పట్టాలు తప్పాయి. అయితే ఈ రైలు అసన్ సోల్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రైలు పట్టాలు తప్పిందని ఆ రైల్ డివిజన్ డీఆర్ఎం రమానంద్ శర్మ తెలిపారు.
ఈ కోచ్ లో దాదాపు 30-40 మంది ఉన్నారని, అయితే ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని ఆయన చెప్పారు. పట్టాలు తప్పిన కారణంగా తాము కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను కాసేపు ఆపాల్సి వచ్చిందని తెలిపారు. కానీ తీవ్రమైన ప్రబావం ఏమీ పడలేదని ఆయన చెప్పారు.
అసన్ సోల్ స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నుంచి సాయంత్రం 6.10 గంటలకు అసన్ సోల్ -బొకారో మెమూ రైలు వెనుక కోచ్ నాలుగు చక్రాలు పట్టాలు తప్పాయని, అయితే వేగం తక్కువగా ఉండం వల్ల ఎవరికీ గాయాలు కాలేదని ఈఆర్ ప్రతినిధి ఏకలబ్య చక్రవర్తి తెలిపారు. దీంతో హౌరా - న్యూఢిల్లీ, సీల్దా-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఒక్కొక్కటి అరగంట ఆలస్యమయ్యాయని చక్రవర్తి తెలిపారు. రాత్రి 7.45 గంటలకు చక్రాలను తిరిగి పట్టాలపై ఉంచిన తరువాత రైలు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చాయని ఆయన చెప్పారు.
