మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. దుండుగులు కొన్ని వాహనాలు ధ్వసం చేశారు. మరి కొన్ని వాహనాలకు నిప్పంటించారు. 

మహారాష్ట్రలో మళ్లీ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న గొడవలో పలువురికి గాయాలయ్యాయి. దుండగులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ హింసాకాండలో ఇరు వర్గాలకు చెందిన సుమారు ఏడుగురికి గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసి, మరో 25 మందిని విచారిస్తున్నారు.

కేర‌ళ రైలు నిప్పు ఘ‌ట‌న‌: ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నిందితుడి అరెస్టు

ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ హింసాత్మక ఘటనతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ‘‘అహ్మద్ నగర్ లో కొందరు ఘర్షణకు దిగారు. కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ అల్లర్లలో గాయపడిన వారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. వదంతులను నమ్మవద్దు’’ అని ఎస్పీ రాకేష్ ఓలా తెలిపారు.

భార్యను చంపి, మృతదేహాన్ని గోనె సంచిలో ఇటుకలతో నింపి, యమునా నదిలో విసిరేసి.. ఓ భర్త దారుణం..

ఇలాంటి ఘటనే నందుర్బార్ జిల్లాలో చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ రాళ్ల దాడి కూడా చోటు చేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 28 మందిని అరెస్టు చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా కిచ్చా సుదీప్..

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు మార్చి 30వ తేదీన జల్గావ్ జిల్లాలో మసీదు వెలుపల మ్యూజిక్ ప్లే చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో 56 మందిని పోలీసులు అరెస్టు చేశారు.