తమ గ్రామంలోని ఓ వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న భర్త.. దాని కారణంగా తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలోనే భార్యను హత్య చేశాడు.
నోయిడా : తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని గోనెసంచిలో వేశాడు. దాంట్లో ఇటుకలు నింపాడు. ఆ సంచిని యమునా నదిలో పడేశాడు. ఈ ఆరోపణలపై సదరు వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రవణ్, ఉష దంపతులు. ఇద్దరూ ముప్పైయేళ్ల వయసువారే. జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛతంగా ఖుర్ద్ గ్రామంలో వారి నివాసం. సోమవారం, శ్రవణ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు నమోదు చేశాడు. అదే రోజు, అలీఘర్‌లో నివసిస్తున్న ఉష కుటుంబ సభ్యులు కూడా శ్రవణే ఉషాను చంపాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.. అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. .
నడి వీధిలో మహిళ ముక్కుకోసిన వ్యక్తి.. వేధింపుల కేసు పెట్టిందని మూడేళ్ల తరువాత ప్రతీకారం..
“విచారణ కోసం శ్రవణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆదివారం-సోమవారం మధ్య రాత్రి తన భార్యను గొంతుకోసి తానే హత్య చేసినట్లు శ్రవణ్ అంగీకరించాడు. ఆ తరువాత భార్య మృతదేహాన్ని ఒక గోనె సంచిలో నింపి, యమునా నదిలో పడవేయాలని పథకం పన్నాడు. అయితే, శవం పైకి తేలకుండా ఉండాలని మృతదేహం ఉన్న గోనెసంచిలో కొన్ని ఇటుకలు నింపాడు”అని అధికారి చెప్పారు.
రోజుకూలీపనులు చేసుకునే శ్రవణ్ భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. తమ గ్రామంలోని ఒక వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం ఉందని తాను నమ్ముతున్నట్లు పోలీసులకు వెల్లడించినట్లు అధికారి తెలిపారు. శ్రవణ్‌పై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద మంగళవారం జేవార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం, మీరట్ నుండి వచ్చిన స్పెషలిస్ట్ డైవర్లు యమునా నది నుండి మృతదేహాన్ని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారని వారు తెలిపారు.
