Asianet News TeluguAsianet News Telugu

చైనా, భారత్ సరిహద్దు సుస్థిరత కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం: చైనా విదేశాంగ మంత్రి

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ వద్ద  ఇండియా, చైనా  ఆర్మీ మధ్య  ఘర్షణ తర్వాత  చైనా విదేశాంగ శాఖ మంత్రి  వాంగ్  యి ఆదివారం నాడు స్పందించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సుస్థిరతకు కట్టుబబడి ఉన్నట్టుగా  చెప్పారు.

China stands ready to work with India: Chinese Foreign Minister
Author
First Published Dec 25, 2022, 3:43 PM IST

బీజింగ్:భారత్ తో  బలమైన సంబంధాలతో పని చేయాలని  తాము భావిస్తున్నామని  చైనా విదేశాంగ శాఖ మంత్రి  వాంగ్  యి ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన  భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని  తవాంగ్ ప్రాంతంలో  భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షన చోటు  చేసుకుంది.ఈ ఘర్షణ తర్వాత చైనా విదేశాంగ  మంత్రి తొలిసారి  స్పందించారు. 

ఆదివారం నాడు  వాంగ్ యి చైనాలో మీడియాతో మాట్లాడారు.  భారత్, చైనా సంబంధాలపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు వాంగ్ యి స్పందించారు.  భారత్, చైనీ లు దౌత్య, సైనిక, మిలటరీ మార్గాల ద్వారా కవ్యూనికేషన్ ను కొనసాగించినట్టుగా  ఆయన చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో  స్థిరత్వాన్ని కొనసాగించేందుకు  రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని  చైనా విదేశాంగ మంత్రి  వాంగ్ యి తెలిపారు. 

తవాంగ్  వద్ద  చైనా, ఇండియా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణపై  పార్లమెంట్ లో   రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  ప్రకటన చేశారు.ఈ విషయమై  చర్చకు  విపక్షాలు పట్టుబడ్డాయి.  కానీ  కేంద్రం అంగీకరించలేదని విపక్షాలు  కేంద్రం తీరును తప్పుబట్టాయి.  ఈ ఘర్షణలో ఇండియాకు  చెందిన  సైనికులు  ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని  కూడా  కేంద్ర మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండు దేశాల  మధ్య  జరిగిన  ఘర్షణ తర్వాత  ఈ నెల  20న చైనా వైపున ఉన్న చుషుల్ మోల్డో  సరిహద్దులో  ఇండియా, చైనాకు చెందిన కమాండర్స్ కార్ప్స్ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో  యథాతథస్థితిని కొనసాగించాలని రెండు దేశాలు  నిర్ణయం తీసుకున్నాయి.  ఇరుపక్షాలు సన్నిహితంగా ఉండేందుకు మిలటరీ, దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరపాలని మిగిలిన సమస్యలపై  పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని త్వరగా  రూపొందించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios