Asianet News TeluguAsianet News Telugu

సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపులు.. ఆయుధాల తరలింపు, పెట్రోలింగ్‌‌లతో అలజడి

సరిహద్దుల్లో డ్రాగన్ మరోసారి కవ్వింపులకు పాల్పడుతోంది. కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొడుతోంది. భారత్‌తో ఉన్న అన్ని సరిహద్దుల్లోనూ డ్రాగన్ దేశం పెట్రోలింగ్ ను, సైన్యాన్ని పెంచేసిందని (eastern army command ) ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. 

china marginally increases patrolling activities across borders
Author
Srinagar, First Published Oct 19, 2021, 2:35 PM IST

గతేడాది డోఖ్లామ్ (doklam issue) , గాల్వాన్ లోయలో (galwan valley ) జరిగిన ఘర్షణల తర్వాత భారత్- చైనా మధ్య (indo china war) యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే.. అది ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తుందని నిపుణులు భావించారు. అయితే చర్చల ద్వారా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరించింది.

అయితే సరిహద్దుల్లో డ్రాగన్ మరోసారి కవ్వింపులకు పాల్పడుతోంది. కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొడుతోంది. భారత్‌తో ఉన్న అన్ని సరిహద్దుల్లోనూ డ్రాగన్ దేశం పెట్రోలింగ్ ను, సైన్యాన్ని పెంచేసిందని (eastern army command ) ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సైనిక శిక్షణ శిబిరాలనూ పెంచిందన్నారు. కీలకమైన లోతైన ప్రాంతాల్లో (లోయలు/ఫింగర్స్) యాక్టివిటీ పెరిగిందన్నారు.

ALso Read:భారత్-చైనా మధ్య 13వ దఫా సైనిక చర్చలు..పీపీ-15 నుంచి వైదొలగాలని సూచన..

‘‘సరిహద్దుల్లో సమీకృత సంయుక్త ఆపరేషన్ ఎక్సర్ సైజులను పెంచింది. సాయుధ బలగాల్లోని వివిధ విభాగాలను ఒక్క చోటుకి చేర్చి ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఎప్పుడూ జరిగేదే అయినా.. ఈ ఏడాది ఇంతకుముందుతో పోలిస్తే డోసు పెంచింది. ఎక్కువ మందితో ఎక్కువ కాలం పాటు ఆ ఎక్సర్ సైజులను కొనసాగిస్తోంది’’ అని మనోజ్ పాండే తెలిపారు.

పెట్రోలింగ్ విధానాల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా.. పెట్రోలింగ్ మాత్రం ఎక్కువైందని ఆయన చెప్పారు. ఏడాదిన్నరగా చైనా చర్యలు ఆందోళన కలిగించేలానే ఉన్నాయని, చైనా నుంచి అనుకోని అటాక్ ఎదురైనా ఎదుర్కొనేందుకు ఈస్టర్న్ కమాండ్ సిద్ధంగా ఉందని మనోజ్ స్పష్టం చేశారు. చైనాకు దీటుగా భారత్ కూడా వాస్తవాధీన రేఖ వద్ద మౌలిక వసతులను పెంచుతోందని తెలిపారు. ఎల్ఏసీ వద్ద నిఘా కోసం డ్రోన్లు, సర్వీలెన్స్ రాడార్లు, మెరుగైన సమాచార వ్యవస్థలను వినియోగిస్తున్నామని చెప్పారు. రక్షణలో సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నామన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios