Asianet News TeluguAsianet News Telugu

భారత్-చైనా మధ్య 13వ దఫా సైనిక చర్చలు..పీపీ-15 నుంచి వైదొలగాలని సూచన..

ఇరు దేశాల నడుమ చుషుల్-మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 

13th round of military talks to resolve LAC issues between India and China fails to break impasse
Author
Hyderabad, First Published Oct 11, 2021, 10:08 AM IST

న్యూఢిల్లీ : eastern Ladakh లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెక్కి వెళ్లి పోవాలని భారత్ మరోసారి తేల్చి చెప్పింది. భారత్-చైనా (India-China border dispute)మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ఆదివారం జరిగాయి. 

ఇరు దేశాల నడుమ చుషుల్-మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 

8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపాయి. భారత్ తరఫు బృందానికి లేహ్ లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.జి.కె.మీనన్ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్ధాఖ్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్ (పీపీ)-15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. 

నిరుడు మే నెలలో చోటు చేసుకున్న ఘర్షణ పునరావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిమీద సైన్యం నుంచి అధికారిక ప్రటకన ఏదీ ఇంకా వెలువడలేదు. 

2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్ లో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. 

కశ్మీర్‌లో సాధారణ ప్రజల ఊచకోత.. రంగంలోకి సైన్యం, 570 మంది ఉగ్రవాదుల అరెస్ట్

రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ యేడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి మ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి. 

ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్ తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్ నొక్కి చెబుతోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ ను అఅతిక్రమించి ఉత్తరాఖండ్ లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios