నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే చైనా లడఖ్ లోని భూభాగాన్ని ఆక్రమించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కానీ తాను ఆయనను విమర్శించబోనని అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్ కు చేరుకొని అమరవీరులకు నివాళి అర్పించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జమ్మూలో అమరవీరుల కుటుంబాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సత్కరించారు. అమరుల కుటుంబాలతో కలిసి నిర్వహించిన గుల్షన్ గ్రౌండ్‌లో అమరుల కుటుంబాలతో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్గిల్ విజయ్ ఆర్మీ పరాక్రమానికి గర్వించదగ్గ అధ్యాయమని ఆయన అన్నారు. ‘‘ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారిని గుర్తుంచుకుంటాం. మన సైన్యం మన దేశం కోసం ఈ అత్యున్నత త్యాగం చేసింది. 1999 యుద్ధంలో మన వీర జవాన్లు చాలా మంది ప్రాణాలు అర్పించారు, వారికి నేను నమస్కరిస్తున్నాను" అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Arvind Kejriwal: "యువతకు ఉపాధి కల్పిస్తాం, మజ్ను కా తిలా, చాందినీ చౌక్‌లను Food Hubsగా మారుస్తాం"
ఈ రోజు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని మాట జాగ్రత్తగా వింటుందని రక్షణ మంత్రి అన్నారు. నేడు ఎవరూ మన సరిహద్దులను ఛేదించలేరని అన్నారు. 1962 చైనాతో జరిగిన యుద్ధం విషయంపై రక్షణ మంత్రి ఇంకా మాట్లాడుతూ.. 1962లో లడఖ్‌లోని మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందని అన్నారు. ‘‘ ఆ సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి. నేను ఆయన ఉద్దేశాలను ప్రశ్నించను. నేను ఏ భారత ప్రధానిని విమర్శంచను. విధానాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఉద్దేశాలు మంచివి కావచ్చు, కానీ ఇది విధానాలకు వర్తించదు. ఇది గత భారతం కాదు. నేడు భారతదేశం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటి.’’ అని అన్నారు.
ఇండియాలో చదువుకి అనుమతివ్వాలి: ఆందోళనకు దిగిన ఉక్రెయిన్ నుండి వచ్చిన మెడికల్ స్టూడెంట్స్
భవిష్యత్తులో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారత్ అవతరిస్తుందని రక్షణ మంత్రి అన్నారు. ‘‘ భారతదేశం అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారు కాదని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే మనం మనం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారు చేసే టాప్ 25 తయారీదారులలో ఒకరిగా ఉన్నాము. మనం ఏదో ఒక రోజు ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎగుమతిలో నంబర్ వన్ అవుతాము. ’’ అని ఆయన అన్నారు.
పొరుగు దేశమైన పాకిస్థాన్ గురించి ప్రస్తావిస్తూ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలను భారత్ కోరుకుంటోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై భారత పార్లమెంట్‌లో తీర్మానం ఆమోదించామని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో భాగమేనని, ఇప్పుడు కూడా మన దేశంలో భాగమేనని చెప్పారు. శివుడి రూపంలో బాబా అమర్‌నాథ్ మనతో ఉంటారని, మాత శారదా శక్తి నియంత్రణ రేఖకు అవతల ఉన్నారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి బ్రిగేడియర్ ఉస్మాన్ , మేజర్ షైతాన్ సింగ్ యొక్క ధైర్యాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్, 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫోరమ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన వెంటకేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సుమారు 1500-2000 మంది అమరవీరుల కుటుంబాలకు శాలువాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు.
