ఉక్రెయిన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధులు తమకు ఇండియాలో వైద్య విద్యను కొనసాగించే అవకాశం కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి వైద్య విద్యార్ధులు, వారి పేరేంట్స్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: Ukraine నుండి India కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధులకు ఇండియాలో చదువుకునే అవకాశం కల్పించాలని కోరుతూ న్యూఢిల్లీలో MBBS Tudents విద్యార్ధులు ఆదివారం నాడు ఆందోళన,కు దిగారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి వందలాది మంది విద్యార్ధులు ఉక్రెయిన్ లో వైద్య విద్య కోసం వెళ్లారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించడంతో ఉక్రెయిన్ నుండి వైద్య విద్యార్ధులన కేంద్రం ఇండియాకు తీసుకు వచ్చింది. వైద్య విద్యను మధ్యలోనే నిలిపివేసిన విద్యార్ధులకు ఇండియాలో చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఉక్రెయిన్ నుండి సుమారు 18 వేల మంది వైద్య విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చారు. పలు రాష్ట్రాల నుండి వందల సంఖ్యలో ఉక్రెయిన్ కు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. Kerala రాష్ట్రంలో సుమారు 3,900 మది ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో వైద్య విద్య చదువుతున్నారు. ఉక్రెయిన్ , రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది.
ఢీల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంబీబీఎస్ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఈ విషయమై ఆందోళన చేస్తున్నారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్ధులు తమ విద్యను కొనసాగించేందుకు గాను తమ సహాయం చేస్తాయని కూడా తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ప్రకటించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా కోరారు. అయితే ఇంతవరకు ఈ విద్యార్ధుల చదువు విషయమై ఇంకా స్పష్టత రాలేదు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు అవకాశం కల్పించాలని కూడా విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు కేంద్రాన్ని కోరుతున్నారు. ఉక్రెయిన్ నుండి వచ్చిన వారికి ఆన్ లైన్ విద్య కంటే కాలేజీల్లో సీట్లు కేటాయించాలని ఉక్రెయిన్ మెడికల్ స్టూడెంట్స్ పేరేంట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో కోరింది.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఉక్రెయిన్ లో ఉన్న తమ పిల్లలను ఇండియాకు తిరిగి తీసుకురావాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్ధుల పేరేంట్స్ ఆందోలన చేసిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధులకు ఇండియాలో చదువుకునే అవకాశం కల్పించే విషయమై కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ ఏడాది మార్చిలో ఈ విషయమై పిటిషన్ దాఖలైంది.
ఈ విషయమై ఐఎంఏ కూడా ప్రధానిని కోరింది. ఉక్రెయిన్ నుండి వచ్చిన వైద్య విద్యార్ధులకు అవకాశం కల్పించాలని కోరింది. ఈ విషయమై ఈ ఏడాది మార్చి 4న ఐఎంఏ ప్రధానికి లేఖ రాసింది. ఉక్రెయిన్ నుండి వచ్చిన వైద్య విద్యార్ధులకు ఇండియాలో ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పించాలని కోరింది.
