నేటి నుంచి పిల్లల కోవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్స్- సెంట్రల్ హెల్త్ మినిస్టర్
15-18 వయసున్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్స్ కోసం నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ లో శనివారం ప్రకటించారు. అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఆంక్షలు విధిస్తున్నాయి. వేడుకలు, ర్యాలీలు, బహిరంగ సభలు, ఇతర బహిరంగ కార్యక్రమాలన్నింటినీ నిషేదించాయి. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇతర దేశాల్లో విజృంభిస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఆరోగ్య మంత్రులతో, ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
వైష్ణోదేవి ఆలయ విషాదానికి ఆదే కారణమా?.. అసలు ఏం జరిగింది?
ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించిన తరువాత మరో సారి అన్ని రాష్ట్రాలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కోవిడ్ కట్టడికి కలిసికట్టుగా పోరాడాలని చెప్పారు. పలు అంశాలతో దిశా నిర్దేశం చేశారు. కరోనా పేషెంట్లకు అసరమైన మందులు, ఆక్సిజన్ సిలెండర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుండటంతో స్కూల్స్, కాలేజీలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని గత నెల చివరల్లో 15-18 సంవత్సరాల వయసున్న వయసున్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించామని తెలిపారు. వీరితో పాటు కోవిడ్ వారియర్స్‌కు, ఆరోగ్య సిబ్బందికి కూడా అదనపు డోసు వేయాలని ప్రకటించారు. పిల్లల వ్యాక్సిన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను గత నెల 29వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది.
నేటి నుంచి అందుబాటులోకి..
గత నెలలనే పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసినప్పటికీ నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. 15 నుంచి 18 మధ్య వయసున్న పిల్లలందరూ వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ నమోదు చేసుకోవాలని ఆయన ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ కొత్త ఏడాది సందర్భంగా నేటి నుంచి 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు కోవిడ్ -19 వ్యాక్సినేషన్ టీకాల కోసం కోవిన్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులైన పిల్లలను టీకా కోసం నమోదు చేయాలని నా కుటుంబ సభ్యులను అభ్యర్థిస్తున్నాను #SabkoVaccineMuftVaccine. ’’ అని మంత్రి హిందీలో ట్వీట్ చేశారు.
మున్ముందు అనేక వేవ్‌లు.. వాటితో కలిసి జీవించడం నేర్చుకోవాలి - ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే.?
15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందించనున్నారు. దీని కోసం నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. దీని కోసం కోవిన్ అనే యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డును ఉపయోగించాలి. అది లేకపోతే కాలేజీలు, స్కూల్స్ లు అందజేసే ఐడీ కార్డులు కూడా ఉపయోగింవచ్చు. ఈ విషయంలో నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్‌ఎస్ శర్మ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారు కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న మాదిరిగానే ఈ ప్రక్రియ కూడా ఉంటుందన్నారు. ఆధార్ కార్డు లేని పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో స్కూల్స్, కాలేజీలు అందించే ఐడీ కార్డులను కూడా అనుమతిస్తున్నామని తెలిపారు.