Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ లో ఆప్ కు క‌వ‌రేజీ ఇవ్వొద్ద‌ని మీడియాను ప్ర‌ధాని స‌ల‌హాదారు హెచ్చ‌రించారు - కేజ్రీవాల్

గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను బీజేపీ సహించలేకపోతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అందుకే తమ పార్టీని టార్గెట్ చేసిందని అన్నారు. 

Chief Adviser warns media not to give coverage to AAP in Gujarat - Kejriwal
Author
First Published Sep 18, 2022, 4:53 PM IST

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. అందుకే అవినీతితో పోరాడుతున్నామంటూ ఆప్ ను అణిచివేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని  ఆరోపించారు. ఆదివారం ఆయ‌న దేశవ్యాప్తంగా ఉన్న ఆప్ ప్రజా ప్రతినిధులందరితో సంభాషించారు.

బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆ ఆర్థిక నేరస్తుడి ఉచ్చులో ఎలా చిక్కారు? తెర వెనుక ఏం జరిగింది?

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను బీజేపీ జీర్ణించుకోలేకపోతోంద‌ని అన్నారు. మోడీ ప్రభుత్వం తన పార్టీ మంత్రులు, నాయకులను తప్పుడు అవినీతి కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు  ఆప్ ప్ర‌భావంతో బీజేపీ ఎంతో ఉలిక్కిప‌డింద‌ని అన్నారు. అందుకే గుజ‌రాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి క‌వ‌రేజీ ఇవ్వొద్ద‌ని ప్రధాని సలహాదారు హిరేన్ జోషి అనేక టీవీ ఛానళ్ల యజమానులను, వాటి ఎడిట‌ర్ల‌ను హెచ్చ‌రించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఒక వేళ క‌వ‌రేజీ ఇస్తే తీవ్ర‌మైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారిని బెదిరిస్తున్నార‌ని అన్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. ఏనుగుల దాడిలో ఇద్దరు వృద్దుల మృతి..

‘ ఇలాంటి పనులు చేయడం మానేయండి. మీడియా ఎడిట‌ర్లు జోషి మెసేజ్ ల‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తే.. ప్రధాని, ఆయన సలహాదారు ఇద్దరూ తమ ముఖాలను దేశానికి చూపించే స్థితిలో ఉండరు ’’ అని ఆయన అన్నారు. గుజరాత్ లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలకు ఉచిత సౌకర్యాలు కల్పించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందని ఆప్ పై విమ‌ర్శలు చేస్తున్నార‌ని కేజ్రీవాల్ కేజ్రీవాల్ ప్రధానిపై పరోక్షంగా మండిపడ్డారు. ‘‘ నిజాయితీ లేని వ్యక్తి, అవినీతిపరుడు, దేశద్రోహి మాత్రమే ఉచితాలు దేశానికి మంచిది కాదని చెబుతారు. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని ఎవరైనా రాజకీయ నాయకుడు చెబితే ఆయన ఉద్దేశాలు తప్పు అని భావించండి ’’ అని కేజ్రీవాల్ అన్నారు. కాగా.. అయితే కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై పీఎంవో, హిరేన్ జోషి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌నా రాలేదు.

లిఫ్ట్‌ ప్రమాదం.. మధ్యలో ఇరుక్కుని ప్రాణాలు వదిలిన టీచర్.. డోర్లు ఓపెన్ ఉండగానే కదిలిన లిఫ్ట్

20 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్ప‌టి వ‌ర‌కు 1446 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పంచాయతీ సభ్యులు కూడా ఉన్నార‌ని చెప్పారు. 20 రాష్ట్రాల్లో త‌మ పార్టీ బీజాలు ఉన్నాయని, అవి భవిషత్తులో వృక్షాలుగా మారుతాయని చెప్పారు. అలాంటి విత్తనాలే ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్‌లలో వృక్షంగా మారాయని తెలిపారు. ప్రస్తుతానికి అయితే గుజరాత్ వంతు వచ్చిందని, త్వరలో చెట్టు కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios