Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థులకు గుడ్‌న్యూస్: 10, 12 తరగతుల పరీక్షలు రద్దు, మార్కులిలా....

10 12వ తరగతుల వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పరీక్షలు రాయకుండానే అందరూ విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది.
 

Chhattisgarh CGBSE cancels pending Board Exams for 10th and 12th, Marks for cancelled paper through internal assessment
Author
Chhattisgarh, First Published May 14, 2020, 3:44 PM IST

రాయ్‌పూర్:10, 12వ తరగతుల వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పరీక్షలు రాయకుండానే అందరూ విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో 10, 12వ, తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తి కాలేదు. ఈ విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొంటున్నాయి. 

also read:కారణమిదే: న్యూఢిల్లీలో లేడీ డాక్టర్‌ ను ఇంట్లో వేసి తాళం వేశాడు

ఈ విషయమై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకొంది. ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించనున్నారు. వీటి ఆధారంగానే పై చదువులకు విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ పరీక్షలను రద్దు చేసింది.

ఒకవేళ ఇప్పుడు పరీక్షలు నిర్వహించినా ఫలితాలు వచ్చే వరకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అదే జరిగితే విద్యా సంవత్సరం ప్రారంభానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios