Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని పెయింటింగ్‌తో సభకు చిన్నారి .. మోడీ ఫిదా.. చిరునామా ఇస్తే, స్వయంగా లేఖ రాస్తానంటూ హామీ

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తూ వుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. దీనిలో భాగంగా గురువారం కాంకేర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో విపక్షాలకు కౌంటర్లు వేస్తూ ఆయన కార్యకర్తలను ఉత్తేజపరిచారు.

chhattisgarh assembly election : pm narendra modi address rally in kanker acknowledges girl child for painting said will write letter ksp
Author
First Published Nov 2, 2023, 6:44 PM IST | Last Updated Nov 2, 2023, 6:53 PM IST

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తూ వుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. దీనిలో భాగంగా గురువారం కాంకేర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో విపక్షాలకు కౌంటర్లు వేస్తూ ఆయన కార్యకర్తలను ఉత్తేజపరిచారు.

ఈ సభకు వచ్చిన ఓ అమ్మాయితో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. భారీ జనసందోహం మధ్య , ప్రధాని మోడీ పెయింటింగ్‌తో వచ్చిన ఆ బాలికను వేదికపై నుండి ప్రశంసించారు ప్రధాని. అంతేకాదు పెయింటింగ్‌పై చిరునామాను వ్రాసి ఇస్తే.. త్వరలోనే తాను స్వయంగా లేఖ రాస్తానని ప్రధాని మోదీ ఆ బాలికకు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

 

 

అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాలనపై మోడీ విమర్శలు గుప్పించారు. భూపేశ్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని.. రాష్ట్రాన్ని లూటీ చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి అనేవి కాంగ్రెస్ విధానాలని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, అభివృద్ధి ఈ రెండూ ఒకే దగ్గర మనుగడ సాగించలేవని ప్రధాని దుయ్యబట్టారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం ఆ పార్టీకి చెందిన నేతల వారసులు, బంధువులు మాత్రమే ప్రయోజనం పొందారని మోడీ ఆరోపించారు. ఓబీసీ వర్గానికి చెందిన తనపై గతంలో కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా దూషణలు చేశారని ప్రధాని గుర్తుచేశారు. పేదలు, గిరిజనులు, వెనుకడిన వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios