Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల చట్టాల్లో మార్పులు ఇప్పుడు అవ‌స‌రం - కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు

మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల చట్టాల్లో మార్పులు కూడా అవసరం అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం సూచించిన సవరణలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. 

Changes in election laws are now necessary - Union Law Minister Kiran Rijuju
Author
First Published Oct 6, 2022, 1:36 PM IST

భారత ఎన్నికల సంఘం సూచించిన కొన్ని ప్రధాన సంస్కరణలకు శాసనపరమైన మద్దతును అందించే విష‌యం ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ఈ స‌మ‌యంలో ఎన్నికల చట్టాల్లో మార్పు అవసరమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానాల, నిధులకు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించేందుకు ప్రతిపాదిత ప్రమాణాలను కమిషన్ ఇటీవల విడుదల చేసింద‌ని, దాని కోసం కేంద్రం ఎన్నికల సంఘంతో చర్చలు జరుపుతోందని మంత్రి తెలిపారు.

రాజ రాజ చోళుడు హిందువు కాదు: ప్రముఖ తమిళ దర్శకుడి వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్.. వివాదంలోకి కమల్ హాసన్

ఈ మేర‌కు ‘టైమ్స్ ఆప్ ఇండియా’కి కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడానికి ఆర్ పీ చట్టం, ఇతర చట్టాలలో కొన్ని ప్రధాన మార్పులను విశ్లేషించడానికి ఎన్నికల సంఘంతో విస్తృతమైన చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఎన్నికల నిఘా సంస్థ తాజా ప్రతిపాదనలను తేవడానికి ముందు ప్రభుత్వాన్ని సంప్రదించిందా అనే ప్రశ్నకు ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. ‘‘మారుతున్న కాలం, పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన సంస్కరణల కోసం ప్రభుత్వం తగిన సంప్రదింపులు జరిపి, వాటిని అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటుంది’’ అని అన్నారు. 

కర్ణాటక: రాహుల్‌ గాంధీతో భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ

ఎన్నికల సంఘం ప్రతిపాదించిన సవరణలు ఏంటంటే ? 
ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రవాహాన్ని నిరోధించడానికి, అరికట్టడానికి పార్టీలు అందుకున్న నగదు విరాళాలను వారి మొత్తం రసీదులలో 20 శాతానికి ప‌రిమితం చేయ‌డానికి ఆర్పీ చ‌ట్టంలో ప్ర‌ధానంగా మార్పులు తీసుకురావాల‌ని ఎన్నికల సంఘం ఇటీవల న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అలాగే రాజకీయ పార్టీల అజ్ఞాత విరాళాల బహిర్గత పరిమితిని రూ.20,000 నుంచి రూ.2,000కి తగ్గించాలని కూడా ఎన్నికల సంఘం ప్రతిపాదించింది.

అమ్మపై ప్రేమ.. సోనియా షూ లేస్‌ను సరిచేసిన రాహుల్ గాంధీ.. వైరల్ అవుతున్న ఫోటో..

ఇదిలావుండగా.. ఎన్నికల సంఘం ప్రతిపాదనలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. రాజకీయ పార్టీలకు వ్యక్తిగత విరాళాలు పోల్ ప్యానెల్ పరిధికి అతీతమైనవని, అందువల్ల వాటిని సవరించరాదని అన్నారు. కాగా.. దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గత మంగళవారం లేఖ రాసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించింది. దీనిపై తమకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని సీఈసీ అన్ని రాజకీయ పార్టీలను కోరింది. అలాగే మీకున్న ఆర్ధిక వనరులు ఏంటీ అనే విషయం అక్టోబర్ 19వ తేదీ లోపు సమాధానం తెలిజేయాలని ఆదేశించింది. 
చంచాగిరికి కూడా కొన్ని ప‌రిమితులుంటాయ్.. రాష్ట్ర‌ప‌తి ముర్ముపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఎన్నికల వాగ్దానాలు చాలా విస్తృతమైన ప్రభావాలను కలిగి ఉంటాయ‌ని ఈసీ అభిప్రాయ‌ప‌డింది. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ఆర్థిక వ‌న‌రులు ఎలా, ఏ మార్గంలో స‌మ‌కూరుస్తారో మేనిఫెస్టోలు స్పష్టంగా సూచించాలని కమిషన్ పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios