ద్రౌపది ముర్ము లాంటి రాష్ట్రపతి ఏ దేశానికి ఉండకూడదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదిత్ రాజ్ అన్నారు. చంచాగిరికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని తీవ్ర పదజాాలాన్ని ఉపయోగించారు.  

కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి వివాదాస్ప‌దం అయ్యాయి. ఆమె ‘చంచాగిరి’లో మునిగిపోయారని ఆరోపించారు. ‘‘ద్రౌపది ముర్ము జీ లాంటి రాష్ట్రపతిని ఏ దేశానికి రాకూడదు. చంచాగిరికి కూడా పరిమితులు ఉన్నాయి. 70 శాతం మంది ప్రజలు గుజరాత్ నుండి ఉప్పు తింటారు. మీరు ఉప్పు తింటూ జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే ఆ విషయం మీకే తెలుస్తోంది ’’ అని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు.

కాగా.. ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్యాంగ పదవులను అధిరోహించిన వ్యక్తులను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ నాయకులకు ఉందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రాష్ట్రపతి ముర్ముకి వ్యతిరేకంగా అలాంటి భాషను ఉప‌యోగించి ఉదిత్ రాజ్ అన్ని హద్దులు దాటారని ఆయన దుయ్య‌బ‌ట్టారు. 

Uttarkashi avalanche: 'మ‌రికొన్నిసెకన్ల సమయం దొరికితే, మరింత మంది ప్రాణాలను కాపాడేవాళ్లం...'

కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌స్తుతం బీజేపీలోఉన్న మరో నాయకుడు టామ్ వడక్కన్ కూడా ఉదిత్ రాజ్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయ‌న‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పదవిని ఎప్పుడూ గౌరవించాలని, దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని వడక్కన్ అభిప్రాయపడ్డారు.

కాగా.. ఈ ఏడాది జూలై నెల‌లో కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాష్ట‌ప‌తి ద్రౌప‌ది ముర్మును ‘రాష్ట్రపత్ని’గా పేర్కొన్నారు. దీంతో ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యారు. చౌద‌రిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాటు బీజేపీ ఎంపీలు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. నిర‌స‌న తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రప‌తికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 

షాకింగ్.. ప్రియుడున్నాడని, వదిలేయమని చెప్పినా భర్త వినకపోవడంతో.. ఆ భార్య చేసిన పని..

ఈ ఆయ‌న వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో అధిర్ రంజన్ చౌదరి దిగివ‌చ్చారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి క్షమాపణలు చెప్పారు. ఆమె అధిరోహించిన ప‌ద‌విని వివరించడానికి తప్పుడు ప‌దాన్ని ఉప‌యోగించాన‌ని పేర్కొన్నారు. తాను అనుకోకుండా ‘రాష్ట్రపత్ని’ అనే పదాన్ని ఒక సారి ఉపయోగించానని, నోరు జారానని తెలిపారు. తాను ఎప్పుడూ రాష్ట్ర‌ప‌తిని అగౌరవంగా భావించలేదు అని ఆయ‌న క్ష‌మాపణలు చెప్పే ముందు మీడియాతో అన్నారు. 

Scroll to load tweet…

తాను బెంగాలీని అని, హిందీ ఎక్కువ‌గా అలవాటు లేద‌ని చెప్పారు. తాను త‌ప్పుచేశాన‌ని అంగీక‌రిస్తున్నాన‌ని తెలిపారు. రాష్ట్ర‌ప‌తికి త‌ప్పకుండా క్ష‌మాప‌ణ‌లు చెబుతాన‌ని, కానీ ఈ పఖండీలకు (కపటవాదులకు) కాదని అన్నారు. 

ఇంత‌కీ ద్రౌప‌ది ముర్ము ఏమ‌న్నారంటే ? 
దేశంలో 76 శాతం ఉప్పును గుజరాత్ ఉత్పత్తి చేస్తుందని, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఉప్పును భారతీయులందరూ వినియోగిస్తున్నారని రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉదిత్ రాజ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ పాల ఉత్పత్తి, వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ లో పాల సహకార సంఘాలు ప్రారంభించిన శ్వేత విప్లవం ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేశంలో 76 శాతం ఉప్పును గుజరాత్ ఉత్పత్తి చేస్తోంది. గుజరాత్ లో ఉత్పత్తి అయ్యే ఉప్పును భారతీయులందరూ వినియోగిస్తారని చెప్పవచ్చు (యహ్ కహా జా సక్తా హై కి సబ్హీ దేశాసి గుజరాత్ కా నమక్ ఖతే హై) ’’ అని రాష్ట్రపతి అక్టోబర్ 3వ తేదీన పేర్కొన్నారు.