Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక: రాహుల్‌ గాంధీతో భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా అక్టోబర్ 7న భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొననున్నారు. గత నెలలో కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ సెప్టెంబ‌ర్ 30న కర్ణాటక చేరుకున్నారు.

Sonia Gandhi on Bharat Jodo Yatra with Rahul Gandhi in Karnataka's Mandya
Author
First Published Oct 6, 2022, 12:35 PM IST

Congress Bharat Jodo Yatra: ప్రస్తుతం కర్ణాటకలో కొన‌సాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ తలపెట్టిన దేశ‌వ్యాప్త‌ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సోమ‌వారం మధ్యాహ్నం కర్ణాటక లోని మైసూర్‌కు  చేరుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆమె పాదయాత్ర లో పాలుగొన్నారు. అంత‌కుముందు సోనియా గాంధీ క‌ర్నాట‌క‌కు చేరుకోగానే కూర్గ్‌లోని మడికేరికి వెళ్లి ఓ ప్ర‌యివేటు రిసార్ట్‌లో బస చేశారు. మాండ్యలో దసరా కోసం రెండు రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమైనప్పుడు ఆమె గురువారం ఉదయం భార‌త్ జోడో యాత్రలో చేరారు.

కాగా, నివేదికల ప్రకారం భార‌త్ జోడో యాత్ర కర్ణాటక గుండా 21 రోజుల పాటు రాష్ట్రంలో 511 కిలో మీట‌ర్లు కొన‌సాగ‌నుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభమై యాత్ర తమిళనాడు, కేరళ మీదుగా శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించింది. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు ఐదు నెలల ప్రయాణంలో 26వ రోజుకు చేరుకుంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడంతో పాటు గత వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టింది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది. 3,570 కిలోమీట‌ర్లు.. 150 రోజుల సుదీర్ఘ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభం అయింది.

 

సెప్టెంబరు 30న ఆ పార్టీ జాతీయ అధినేత రాహుల్‌ గాంధీ కేరళ సరిహద్దులోని చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట మీదుగా రాష్ట్రంలోకి అడుగుపెట్టడంతో కర్ణాటక పాదయాత్ర ప్రారంభమైంది. భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ముగ్గురు పాల్గొనడం ఇదే తొలిసారి. కర్ణాటకలో చామరాజనగర్, మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో వారి పాదయాత్ర కొన‌సాగనుంది. రాయచూరు నుంచి పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాయచూరు మీదుగా రాష్ట్రం నుంచి బయలుదేరే ముందు అక్టోబర్ 19న బళ్లారిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. గాంధీతో పాటు, కాంగ్రెస్ చీఫ్ పదవికి పోటీ పడుతున్న వారిలో ఒకరైన పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గురువారం పాదయాత్రలో చేరనున్నారు. అలాగే, కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ అక్టోబర్ 7న పాదయాత్రలో పాల్గొననున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios