Chandrayaan-3 launch: చంద్రయాన్-3 దేశ ప్రజల ఆశలు, కలలను సాకారం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. 2019లో విఫలమైన చంద్రయాన్-2 మిషన్ తరువాత సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా భారతదేశం చేసిన రెండవ ప్రయత్నం ఇది. 2008లో చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండింగ్ కావడానికి ముందు విజయవంతంగా చంద్రుని చుట్టూ పరిభ్రమించింది. శ్రీహరికోట ఇస్రో ప్రయోగ కేంద్రం నుండి ఎల్‌వీఎం-3 రాకెట్ ను ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మెన్ సోమనాథ్ ప్రకటించారు.
India's Chandrayaan-3: చంద్రయాన్-3 దేశ ప్రజల ఆశలు, కలలను సాకారం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. 2019లో విఫలమైన చంద్రయాన్-2 మిషన్ తరువాత సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా భారతదేశం చేసిన రెండవ ప్రయత్నం ఇది. 2008లో చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండింగ్ కావడానికి ముందు విజయవంతంగా చంద్రుని చుట్టూ పరిభ్రమించింది. శుక్రవారం (జూలై 3) చంద్రయాన్ -3 ప్రయోగానికి భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముఖ్యమైన చంద్ర మిషన్ దేశ ఆకాంక్షలు, ఆశయాలను కలిగి ఉందని ఆయన నొక్కి చెప్పారు.భారత అంతరిక్ష రంగానికి సంబంధించి 14 జూలై 2023 ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశ ఆశలు-కలలను తీసుకువెళుతుందని అన్నారు.
యావత్ దేశం ఆశలను మోసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైతే రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రుడిపై నియంత్రిత ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. బాహుబలి రాకెట్ గా పిలిచే మార్క్ 3 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ లో విక్రమ్ ల్యాండర్ ఉంది. నింగిలోకి విజయవంతంగా ప్రయోగం జరిగినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విజయం తర్వాత ప్రధాని మోడీ స్పందిస్తూ.. "చంద్రయాన్-3 భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇది ప్రతి భారతీయుడి కలలను, ఆశయాలను పెంచుతుంది. ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల అలుపెరగని అంకితభావానికి నిదర్శనం. వారి స్ఫూర్తికి, చాతుర్యానికి సెల్యూట్ చేస్తున్నాను" అని పేర్కొన్నారు.