Asianet News TeluguAsianet News Telugu

రేపే చంద్రయాన్-2: నేటి నుంచే కౌంట్ డౌన్

చంద్రయాన్-2 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. ఈ నెల 14వ తేదీన ఈ ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. సాంకేతిక సమస్యలను సరిచేసిన తర్వాత ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Chandrayaan-2 mission launch rehearsal completed, performance normal: Isro
Author
Nellore, First Published Jul 21, 2019, 8:11 AM IST


నెల్లూరు: చంద్రయాన్-2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు.ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2:43 గంటలకు శ్రీహారికోట నుండి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3ఎం1 వాహక నౌకను ప్రయోగించనున్నారు.

ఇస్రో బాహుబలి రాకెట్ గా జీఎస్ఎల్‌వీ మార్క్ 3ఎం1 వాహక నౌకను ప్రయోగిస్తారు. ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ -2 ప్రయోగం సక్సెస్ కాలేదు. సాంకేతిక కారణాలతో ఆ రోజున ఈ ప్రయోగాన్ని అర్ధాంతరంగానే నిలిపివేశారు. 

సాంకేతిక లోపాలను సరిదిద్దిన తర్వాత ఈ  జీఎస్ఎల్‌వీ మార్క్ 3ఎం1 వాహక నౌకను సోమవారం నాడు ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇస్రో ఛైర్మెన్  శివన్ ఈ విషయమై శాస్త్రవేత్తలతో చర్చించారు.

లాంచ్ ఆథరైజేషన్ (ల్యాబ్) సమావేశంలో లోటుపాట్లపై చర్చించారు. వాహక నౌక ప్రయోగానికి ఈ సమావేశంలో అనుమతి ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు జీఎస్ఎల్‌వీ మార్క్ 3ఎం1 వాహక నౌక కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 

కౌంట్‌డౌన్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3,850 కిలోల బరువు కలిగిన చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. 

ఈ నెల 14వ తేదీన చంద్రయాన్-2 ప్రయోగానికి 56 నిమిషాల ముందు కౌంట్ డౌన్ ను నిలిపివేశారు. క్రయోజనిక్ దశలో వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగానే ఆ రోజున ప్రయోగం అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని శాస్త్రవేత్తలు.

చంద్రయాన్ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన రాష్ట్రపతి కోవింద్ నిరాశతోనే వెనుదిరిగి వెళ్లారు. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు షార్ వెలుపల కూడ ఏర్పాట్లు చేశారు. కానీ, ప్రయోగం సక్సెస్ కాకపోవడంతో అందరూ వెనుదిరిగారు. మరో వైపు 

Follow Us:
Download App:
  • android
  • ios