నెల్లూరు: చంద్రయాన్-2కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సోమవారం నాడు మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్ ను ప్రయోగించనున్నారు. చంద్రయాన్‌-2కు ఆదివారం సాయంత్రం 6:45 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

ఈ నెల 14వ తేదీన  చంద్రయాన్ -2 ప్రయోగం సాంకేతిక సమస్యలతో వాయిదా పడింది. ఈ ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను శాస్త్రవేత్తలు సరిచేశారు.  
సాంకేతిక సమస్యలను అధిగమించి చంద్రయాన్-2  ప్రయోగం కోసం  సర్వం సిద్దం చేసింది. జీఎస్ఎల్‌వీ- మార్క్3 ఎం1 నింగిలోకి వెళ్లనుంది. వాహక నౌక 3.8 టన్నుల బరువు గల చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

ప్రయోగ వేదిక సతీష్ ధావన్ ప్రయోగ కేంద్రం నండి రాకెట్‌ బయలుదేరిన తరువాత 16.13 నిమిషాలపాటు ప్రయాణించనుంది. నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత చంద్రయాన్ -2 రాకెట్ నుండి విడిపోతుంది. క్రయోజనిక్ ఇంజన్ లో సాంకేతిక లోపంతో  ఈ నెల 14వ తేదీన ప్రయోగం వాయిదా పడింది.

చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. ఆర్బిటర్ నుండి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

రేపే చంద్రయాన్-2: నేటి నుంచే కౌంట్ డౌన్