న్యూఢిల్లీ: .దేశ భవిష్యత్ కోసం కలిసి పనిచేయాలనే అభిప్రాయానికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు. రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

గంటకు పైగా మా మధ్య ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం చర్చించామని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.  గతాన్ని వదిలేసి భవిష్యత్ కోసం కృషి చేస్తామన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో  సమావేశం ముగిసిన తర్వాత  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీలు మీడియాతో మాట్లాడారు. 

 

ఫ్రంట్‌కు ఏ ఒక్కరూ కూడ నాయకుడు లేడన్నారు. అందరం కలిసి పనిచేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని రక్షించడమే మా ముందున్న ప్రథమ కర్తవ్యమని రాహుల్ గాంధీ అన్నారు. మిగిలిన విషయాలన్నింటిని కూడ ఆ తర్వాత చర్చించనున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు.

రాఫెల్ వ్యవహారంలో అవినీతి జరిగిందనడంలో సందేహం లేదన్నారు రాహుల్ డీల్ పై విచారణ జరపాల్సిన వ్యవస్థలపై దాడి చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు, ప్రజాస్వామ్యమే ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు.భావ సారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.

బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ  బీజేపీ సర్కార్ నాశనం చేస్తోందని చంద్రబాబునాయుడు విమర్శించారు.బీజేపీయేతర పార్టీలన్నీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించనున్నట్టు  చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కు రాహుల్ గాంధీ మద్దతిచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

రాహుల్‌తో చంద్రబాబు భేటీ: తెలంగాణ సర్ధుబాట్లపైనా చర్చ

సేవ్ నేషన్ పోరు జోరు: పవార్, ఫరూక్ లతో బాబు భేటీ

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు