న్యూఢిల్లీ: బిజెపికి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కూడగట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన చంద్రబాబు తన బిజెపి వ్యతిరేక శక్తుల ఐక్యతను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారనేది అర్థమవుతోంది.

అందులో భాగంగానే ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీజేపీ, ఎన్డీయేతర ఐక్య కూటమి ఏర్పాటుపై చర్చించారు. 

టీడీపీ, ఎస్పీ కలిస్తే దేశంలో పెను మార్పులు ఖాయమని సమావేశానంతరం ములాయం చెప్పారు. తెలుగుదేశం పార్టీతో తమకు విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం అమరావతికి బయలుదేరే ముందు ఆయన ములాయం, అఖిలేష్ లతో సమావేశమయ్యారు.  చర్చల ద్వారా మార్గం ఏర్పడుతుందని అఖిలేష్ యాదవ్ చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలనే విషయంపై చంద్రబాబు మాట్లాడినట్లు అఖిలేష్ యాదవ్ చెప్పారు.

ఢిల్లీ విమానాశ్రయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చంద్రబాబును కలిశారు.

 

సంబంధిత వార్తలు

రాహుల్‌తో చంద్రబాబు భేటీ: తెలంగాణ సర్ధుబాట్లపైనా చర్చ

సేవ్ నేషన్ పోరు జోరు: పవార్, ఫరూక్ లతో బాబు భేటీ

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు