Asianet News TeluguAsianet News Telugu

చంఢీగ‌డ్ విమానాశ్ర‌యానికి భ‌గ‌త్ సింగ్ పేరు పెడుతాం - ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

చంఢీగ‌డ్ ఎయిర్ పోర్టుకు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెడుతామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మాన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. 

Chandigarh Airport to be named after Bhagat Singh - PM Narendra Modi
Author
First Published Sep 25, 2022, 1:58 PM IST

ప్ర‌ముఖ స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రకటించారు. సెప్టెంబరు 28న భగత్ సింగ్ జయంతి జరుపుకునే ముఖ్యమైన రోజు ‘అమృత్ మహోత్సవ్’ రాబోతోందని ఆయన అన్నారు.

భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి.. రష్యా మద్దతు

తన నెల‌వారీ మన్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మంలో ఆదివారం ఆయ‌న ప్ర‌సంగించారు. ‘‘ ఆయన (భగత్ సింగ్) జయంతికి ముందు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం’’ అని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా చండీగఢ్, పంజాబ్, హర్యానా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, దీని కోసం ఇక్క‌డి ప్ర‌జ‌లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నార‌ని అన్నారు. 

వాతావరణ మార్పు సముద్ర పర్యావరణ వ్యవస్థలకు పెను ముప్పు అని, బీచ్‌లలో చెత్తాచెదారం కలవరపెడుతుందని మోడీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ‘‘ ఈ సవాళ్లను పరిష్కరించడానికి తీవ్రమైన, నిరంతర ప్రయత్నాలు చేయడం మా బాధ్యత ’’ అని ఆయన అన్నారు. 

గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు భారీగా ఖ‌ర్చు చేసిన తృణ‌మూల్, బీజేపీ

చిరుతలు తిరిగి రావడం వల్ల 130 కోట్ల మంది భారతీయులు గర్వంతో పొంగియారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. టాస్క్‌ఫోర్స్ ఆ చిరుతలను పర్యవేేక్షిస్తుందని తెలిపారు. వారి సూచనల ఆధారంగా ప్ర‌జ‌లు ఆ చిరుత‌ల‌ను ఎప్పుడు చూడ‌వ‌చ్చో నిర్ణ‌యిస్తామ‌ని చెప్పారు.

రెండో రోజే కనిపించుకుండా పోయిన భార్య.. మరో పెళ్లికి రెడీ.. పక్కా ప్లాన్‌తో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

ఈ రేడియో ప్ర‌సంగంలో బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నివాళి అర్పించారు. ఆయ‌న లోతైన ఆలోచనాపరుడ‌ని, దేశానికి గొప్ప కుమారుడని కొనియాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios