Asianet News TeluguAsianet News Telugu

విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లు.. 35 చానెళ్లను నిషేధించిన కేంద్రం

భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని యూట్యూబ్ చానెళ్లు ఫేక్ న్యూస్‌ను విపరీతంగా ప్రసారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి తెలిపాయి. దీంతో ఐ అండ్ బీ శాఖ వెంటనే చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే 35 యూట్యూబ్ చానెళ్లు, వెబ్‌సైట్లు, పలు సోషల్ మీడియా ఖాతాలనూ నిషేధించింది. ఈ విషయాలను ఐ అండ్ బీ శాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి వెల్లడిదంచారు.
 

centre impose ban on 35 youtube channels
Author
New Delhi, First Published Jan 21, 2022, 7:30 PM IST

న్యూఢిల్లీ: కొన్ని పాకిస్తాన్‌(Pakistan)కు చెందిన యూట్యూబ్ చానెళ్లు(Youtube Channels), సోషల్ మీడియా(Social Media) ఖాతాలు భారత్‌కు వ్యతిరకంగా విషం కక్కుతున్నాయి. ఫేక్ న్యూస్‌(Fake News)లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ చానెళ్ల గురించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించాయి. దీంతో వాటిని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాయి. 35 యూట్యూబ్ చానెళ్లను, పలు సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్(Ban) చేసినట్టు శుక్రవారం ఐ అండ్ బీ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు. ఈ యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా ఖాతాల కంటెంట్‌కు 130 కోట్ల వ్యూస్ వచ్చినట్టు తెలిపారు.

ఈ ఖాతాలు పాకిస్తాన్‌కు చెందినవని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌క్యాస్టింగ్ మినిస్ట్రీ సెక్రెటరీ వెల్లడించారు. ఇవి ఫేక్ న్యూస్‌ను ప్రసారం చేస్తున్నాయని వివరించారు. ఇది భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాయని తెలిపారు. ఐటీ రూల్స్ ప్రకారం ఈ యూట్యూబ్ చానెళ్లు, ఇతర సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవడం మొదలు పెట్టామని ఐ అండ్ బీ శాఖ సంయుక్త కార్యదర్శి విక్రమ్ సహాయ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 35 యూట్యూబ్ చానెళ్లను నిషేధించినట్టు తెలిపారు. వీటితోపాటు రెండు ట్విట్టర్ హ్యాండిళ్లను, రెండు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిళ్లను, రెండు వెబ్‌సైట్లు, ఒక ఫేస్‌బుక్ ఖాతానూ బ్యాన్ చేసినట్టు వివరించారు. ఈ చానెళ్లు, ఖాతాలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించారని అధికారులు వెల్లడించారు.

ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తమకు సమాచారం అందగానే.. చర్యలు తీసుకున్నామని అధికారులు ఐబీ శాఖ సంయుక్త కార్యదర్శి సహాయ్ వెల్లడించారు. ఇలాంటి కంటెంట్‌పై సోషల్ మీడియా సంస్థలు కూడా దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ చానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లలోని కంటెంట్‌ను 130 కోట్ల మంది వీక్షించారని పేర్కొన్నారు. అంతేకాదు, 1.2 కోట్ల సబ్‌స్క్రైబర్లూ ఉన్నారని వివరించారు. ఖబర్ విత్ ఫ్యాక్ట్స్, గ్లోబల్ ట్రూత్, ఇన్ఫర్మేషన్ హబ్, అప్నీ దున్యా టీవీ, బోల్ మీడియా టీవీ సహా పలు చానెళ్లు ఈ నిషేధించిన చానెళ్ల జాబితాలో ఉన్నాయి. వైట్‌ప్రొడక్షన్‌డాట్‌కమ్‌డాట్‌పీకే, డీనౌమీడియాడాట్‌కమ్‌‌ వెబ్‌సైట్లు బ్యాన్ అయ్యాయి.

వీటిని బ్లాక్ చేయడం కష్టసాధ్యమని అధికారులు తెలిపారు. అయితే, కనీసం ఆ ఖాతాల నుంచి ఫేక్ న్యూస్‌ల సంఖ్యను తగ్గించడానికైనా చర్యలు తీసుకుంటామని వివరించారు. గత నెలలోనూ కేంద్ర ప్రభుత్వం 20 యూట్యూబ్ చానెళ్లను ఇదే విధంగా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

గత నెలలో పాక్ స్పాన్సర్డ్ సైబర్ ఉగ్రవాదంపై (cyber terrorism) భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్ అనుకూల యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించింది. భారత్‌కు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో ప్రచారం చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన 20కి పైగా బ్లాక్ చేసింది. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా పాక్ కార్యక్రమాలు (pakistan) చేపడుతోంది. దీంతో ఆయా ఛానెల్స్‌లో పాక్ చేస్తున్న ఫేక్ న్యూస్  ప్రచారానికి చెక్ పెట్టింది భారత్. కొత్త ఐటీ చట్టం ప్రకారం (new it policy 2021) ఈ మేరకు చర్యలు చేపట్టింది కేంద్రం. 

Follow Us:
Download App:
  • android
  • ios