Asianet News TeluguAsianet News Telugu

కెన‌డాలోని భార‌త విద్యార్థుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచ‌న‌.. ఎందుకంటే ?

కెనడాలో నివసిస్తున్న భారతీయులు, భారతీయ విద్యార్తులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. టొరంటో, వాంకోవర్‌లోని కాన్సులేట్‌లలో భారతీయ విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. 

Center warns Indian students in Canada Advice to be careful..
Author
First Published Sep 23, 2022, 4:17 PM IST

కెనడాలో విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉండే భార‌తీయ విద్యార్థులు, భార‌త పౌరులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఒక హెచ్చ‌రికను జారీ చేసింది.

ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ టైర్లకింద నలిగిపోయిన ఆరు నెలల చిన్నారి..

వేర్పాటువాద గ్రూపులు నిర్వహించిన ఖలిస్తాన్ రెఫరెండం ను ఒక ‘‘ప్రహసన వ్యాయామం’’గా భారత్ పేర్కొని ఒక రోజు గడిచిన తరువాత ఈ సలహా వచ్చింది. ‘‘ పెరుగుతున్న నేరాల దృష్ట్యా, కెనడాలోని భారతీయ పౌరులు, చదువుకునేందుకు భారతదేశం నుంచి కెనడాకు వెళ్లే విద్యాార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలి. అప్రమత్తంగా ఉండాలి.’’ అని పేర్కొంది. 

సెప్టెంబర్ 19వ తేదీన ఒంటారియోలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తాన్ రిఫరెండం కోసం 100,000 మంది కెనడియన్ సిక్కులు ఓటింగ్‌లో పాల్గొన్నారు, దీనిని ఖలిస్తానీ అనుకూల సమూహం సిక్క్ ఫర్ జస్టిస్ (SFJ) నిర్వహించారు. ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు క్యూలో నిల్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం.. పాద‌ర‌క్ష‌ల త‌యారీ క‌ర్మాగారంలో చెల‌రేగిన మంట‌లు

దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడారు. ఈ ఓటింగ్ ను ఉగ్రవాద, రాడికల్ ఎలిమెంట్స్ చేసిన ప్రహసన వ్యాయామంగా అభివర్ణించారు. స్నేహపూర్వక దేశంలో దీనిని అనుమతించడం తీవ్ర అభ్యంతరకమైనది అన్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ.. ‘‘ కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులు ఒట్టావాలోని భారతీయ మిషన్ లేదా టొరంటో, వాంకోవర్‌లోని కాన్సులేట్‌లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. ఏదైనా అవసరం లేదా అత్యవసర పరిస్థితుల్లో కెనడాలోని భారతీయ పౌరులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి హైకమిషన్, కాన్సులేట్ జనరల్‌లకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు MADAD పోర్టల్ లేదా madad.gov.in వెబ్ సైట్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

గాంధీ కుటుంబ స‌భ్యులెవ‌రూ కాంగ్రెస్ చీఫ్ కాకూడ‌ద‌ని రాహుల్ గాంధీ నాతో అన్నారు - అశోక్ గెహ్లాట్

కాగా.. కెనడాలో 1.6 మిలియన్ల మంది భారతీయ మూలాలు ఉన్న ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ఆ దేశ జనాభాలో 3 శాతం కంటే ఎక్కువ భారతీయులే ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios