త్వరలో ఉల్లి ధరలు పెరుగుతాయనే హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఉల్లి ఎగుమతులపై ఏకంగా 40 శాతం సుంకం విధించింది. ఇది డిసెంబర్ 31 వరకు అమల్లో వుంటుందని కేంద్రం వెల్లడించింది.
దేశంలో నిన్న మొన్నటి వరకు టమోటా ధరలు ప్రజలను వణికించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో కేజీ రూ.300 పైనే పలికింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు రైతుల దిగుమతులు పెరగడంతో టమోటా ధరలు దిగొచ్చాయి. అయితే త్వరలో ఉల్లి ధరలు పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ పరిస్థితులు తలెత్తకుండా కేంద్రం అప్రమత్తమైంది.
Also Read: అమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్న ఎన్నారైలు.. భారీగా క్యూ లైన్లు.. అసలు కారణమిదే..!!
ఉల్లి ఎగుమతులపై ఏకంగా 40 శాతం సుంకం విధించింది. ఇది డిసెంబర్ 31 వరకు అమల్లో వుంటుందని కేంద్రం వెల్లడించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఉల్లి ధరలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బఫర్ స్టాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
బియ్యం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో ఒకటి బియ్యానికి బలమైన డిమాండ్. ఇది కాకుండా, భారతదేశం ఇటీవల బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. దీంతో ధరలు కూడా పెరిగాయి. భారతదేశ ఎగుమతులపై నిషేధం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో బియ్యం సరఫరా తగ్గింది. దీనితో పాటు, కొన్ని వరి ఉత్పత్తి చేసే దేశాలలో అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా తక్కువ దిగుబడి కూడా ఒక ప్రధాన కారణం. దీంతో సరఫరా మరింత తగ్గింది.
బియ్యం ఎగుమతుల్లో భారతదేశం వాటా
ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్‌కు 40 శాతం వాటా ఉంది. దేశీయ ధరలను నియంత్రించేందుకు భారత్ గత నెలలో బియ్యం ఎగుమతిని నిషేధించింది. దీంతో అమెరికా సహా ప్రపంచంలో పలు దేశాల్లో ఇటీవలి వారాల్లో, బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భారత్ బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడం ద్వారా ప్రపంచ మార్కెట్‌లో ఆహార ధరల్లో అస్థిరత పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
అనేక దేశాల్లో సంక్షోభం తలెత్తవచ్చు
బియ్యం ధరల పెరుగుదల అనేక దేశాలలో ఆహార భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు బియ్యం ప్రధాన ఆహారం. అధిక ధరలు ఈ అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయడం ప్రజలకు మరింత కష్టతరం చేస్తాయని నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం, బియ్యం ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం, థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా, పాకిస్తాన్ ప్రముఖంగా ఉన్నాయి. కాగా, చైనా, ఫిలిప్పీన్స్, బెనిన్, సెనెగల్, నైజీరియా, మలేషియా దేశాలు బియ్యానికి ప్రధాన దిగుమతిదారులు.
