అమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్న ఎన్నారైలు.. భారీగా క్యూ లైన్లు.. అసలు కారణమిదే..!!

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. . దీంతో అమెరికాలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  
 

indians in usa rush for buying rice after India rice export curbs ksm

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక నోటిఫికేషన్‌లో నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. నోటిఫికేషన్‌కు ముందే ఓడలో బాస్మతియేతర బియ్యాన్ని లోడ్ చేయడం ప్రారంభించినట్లయితే లేదా షిప్పింగ్ బిల్లు ఉంటే మాత్రమే మినహాయింపులు ఇవ్వబడతాయని తెలిపింది. దీంతో అమెరికాలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

దీంతో అమెరికాలోని చాలా మంది ఎన్నారైలు వెంటనే సూపర్ మార్కెట్‌లకు క్యూ కట్టారు.  కొందరైతే సెలవులు పెట్టి మరి  బియ్యం కొనుగోళ్లకు పరుగులు తీశారు.  భవిష్యత్తులో బియ్యానికి ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో పెద్ద ఎత్తున బియ్యం కొనుగోళ్లు చేయడం ప్రారంభించారు. దీంతో సూపర్ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున  క్యూలు కనిపించాయి. ఇదిలా ఉంటే, ఓ స్టోర్‌లో బియ్యం కొనుగోలు చేయడం కోసం జనాలు ఎగబడిన దృశ్యాలు కూడా దర్శనమిచ్చాయి. 

 

 

ఈ క్రమంలోనే అనేక సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డు కనిపించింది. అయితే ఈ క్రమంలోనే  స్థానికంగా కొన్ని ఇండియన్ స్టోర్‌లు బ్లాక్ మార్కెట్ దందాకు తెరదీసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 15 డాలర్ల బియ్యం బస్తాను.. 50 డాలర్లకు కూడా విక్రయిస్తున్నారని అమెరికాలోని కొందరు భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు కూడా పెంచినట్టుగా అక్కడి సూపర్ మార్కెట్ యజమానులు పేర్కొంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios