Asianet News TeluguAsianet News Telugu

Amazon కు సీసీఐ భారీ షాక్​.. . రూ. 200 కోట్లు ఫైన్​

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ (Amazon)కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)   భారీ జరిమానా విధించింది. ఫ్యూచర్ రిటైల్ తో ఒప్పందం నేపథ్యంలో అమెజాన్ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేల్చి  రూ.202 కోట్ల జ‌రిమానా ను విధించింది. మ‌రోవైపు.. కిశోర్​ బియానీకి చెందిన ఫ్యూచర్​ గ్రూప్​తో ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ (Reliance retail) రూ.24,713 కోట్ల​ ఒప్పందాన్ని.. సవాలు చేస్తు అమెజాన్ న్యాయపోరాటం చేస్తున్న వేళ సీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 

CCI suspends Amazon's deal with Futur Group
Author
Hyderabad, First Published Dec 18, 2021, 10:19 AM IST

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ (Amazon)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమెజాన్ కు భారీ జరిమానా విధించింది. ఫ్యూచర్ (Futur Group) కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో 2019లో కుదిరిన వాటాల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసి.. అనూహ్యంగా రూ.202 కోట్ల జరిమానా చెల్లించాలంటూ అమెజాన్ (Amazon)ను ఆదేశించింది. రెగ్యులేటరీ అనుమతి కోరే సమయంలో అమెజాన్‌ కొన్ని కొన్ని ఉల్లంఘనలకు పాల్పడినట్టు సీసీఐ పేర్కొంది. డీల్‌ను మళ్లీ కొత్తగా పరిశీలించాల్సి ఉందని 57 పేజీల లేఖలో పేర్కొంది. అప్పటి వరకు ఈ డీల్‌ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది.

ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో రెండేళ్ల కింద‌ట 49 శాతం పెట్టుబడులు పెట్టింది. ఈ మేర‌కు 2019లో అమెజాన్‌ 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. తద్వారా ఫ్యూచర్ గ్రూప్ లో అమెజాన్ కు 9.82 శాతం వాటా ఏర్పడింది. అంతేకాదు, ఫ్యూచర్ గ్రూప్ ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ కు అధికారం లభించినట్టయింది.  అంటే పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌కు కూడా యాజమాన్య హక్కులు ఉన్నాయి. 

Read Also: Omicron: ఇండియాలో సెంచరీ దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో నమోదు.. అనవసర ప్రయాణాలు వద్దు: కేంద్రం

ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ మధ్య రూ,24,713 కోట్ల విలువ చేసే ఒప్పందం కుదిరింది. అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదిస్తోంది. ఈ ఒప్పందాన్ని స‌వాల్ చేస్తూ.. అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్  ఆశ్ర‌యించింది. అటు, ఫ్యూచర్ గ్రూప్ సీసీఐకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఫ్యూచర్‌ గ్రూప్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

Read Also: మహిళ చెడ్డీని మాస్కుగా పెట్టుకుని విమానంలోకి.. అడిగితే అడ్డగోలు వాదన.. నిషేధం విధించిన ఎయిర్ లైన్స్...

ఈ నేపథ్యంలో,  సీసీఐ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయంగా మారింది. గతంలో ఫ్యూచర్ రిటైల్ తో ఒప్పందం కోసం తాను అమెజాన్ కు ఇచ్చిన అనుమతిని సస్పెండ్ చేసింది. రెగ్యులేటరీ అనుమతులు తీసుకునే అంశంలో అమెజాన్ కొన్ని అంశాలను దాచిందని సీసీఐ ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలన చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

Read Also: నాటు వైద్యం చేయిస్తానని తీసుకెళ్లి.. మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం.. ఆరోగ్యం క్షీణించడంతో...

Follow Us:
Download App:
  • android
  • ios