Asianet News TeluguAsianet News Telugu

రాఫేల్‌ డీల్‌లో మరో సంచలనం.. ‘ఆ ముడుపులపై ఆధారాలున్నా సీబీఐ దర్యాప్తు చేయలేదు’

రాఫేల్ డీల్‌లో మరో సంచలనం వెలుగుచూసింది. ఈ డీల్‌పై ఆది నుంచి అవినీతి ఆరోపణలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ డీల్‌ను భారత్ నుండి అందుకోవడానికి ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ దసో ఓ మధ్య దళారికి సుమారు రూ. 65 కోట్లు చెల్లించినట్టు ఫ్రెంచ్ ఆన్‌లైన్ జర్నల్ మీడియాపార్ట్ సంచలన కథనం ప్రచురించింది. అయితే, ఈ విషయం తెలిసినా, ఓ ఫిర్యాదు వచ్చినా సీబీఐ దర్యాప్తు చేయదలుచుకోలేదని దుమారం రేపింది.
 

cbi decided not to probe rafale deal allegations says french mediapart
Author
New Delhi, First Published Nov 8, 2021, 4:20 PM IST

న్యూఢిల్లీ: French ఏవియేషన్ సంస్థ దసో నుంచి రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఏళ్ల తరబడి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ Dealపై సంచలన ఆరోపణలు వచ్చాయి.. ఒప్పందం కూడా అనూహ్య మలుపులతో ముగిసింది. తాజాగా, మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వం యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ఆఫర్‌ను తామే దక్కించుకోవాలని Dassault తాపత్రయపడింది. India నుంచి యుద్ధ విమానాల కొనుగోలు డీల్‌ను దక్కించుకోవడానికి ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ మధ్య దళారికి సుమారు రూ. 65 కోట్లు చెల్లింపులు జరిపినట్టు ఫ్రెంచ్ పరిశోధనాత్మక మీడియా సంస్థ Mediapart ఓ సంచలన కథనం వెలువరించింది. అంతేకాదు, Rafale Jets డీల్ Corruptionకి సంబంధించి అధికారిక ఫిర్యాదు అందినప్పటికీ.. ఈ ముడుపుల విషయం తెలిసి కూడా.. దర్యాప్తు చేయవద్దనే సీబీఐ నిర్ణయం తీసుకుందనీ పేర్కొంది. 

మీడియాపార్ట్ అనే ఫ్రెంచ్ ఆన్‌లైన్ జర్నల్ రూ. 59వేల కోట్ల రాఫేల్ డీల్‌పై వచ్చిన ఆరోపణలపై పరిశోధనాత్మక కథనాలు ప్రచురిస్తున్నది. ఈ కథనాల నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రభుత్వం జులైలో న్యాయ విచారణకు ఆదేశించింది. 

భారత్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ఆఫర్‌ను చేజిక్కించుకోవడానికి దసో సంస్థ మధ్య దళారి సుషేన్ గుప్తాకు నకిలీ ఇన్వాయిస్‌ల రూపంలో సుమారు రూ. 65 కోట్ల ముడుపులు అందించిందని మీడియా పార్ట్ కథనం పేర్కొంది. అత్యంత రహస్యంగా ఉన్న ఈ డాక్యుమెంట్లు సీబీఐకి అందాయని వివరించింది. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు విచారిస్తుండగా భారత దర్యాప్తు సంస్థలకు ఈ డాక్యుమెంట్లు అందాయని పేర్కొంది.

Also Read: అబ్బురపరిచే రాఫేల్ జెట్ విన్యాసాలు.. తొలిసారిగా చిత్రాలు విడుదల చేసిన వైమానిక దళం

ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో సుషేన్ గుప్తా అక్రమ సొమ్మును మారిషస్‌లోని తన కంపెనీ ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ ద్వారా అందుకున్నాడని ఆరోపణలు రాగా, మారిషస్ ప్రభుత్వం ఆ కంపెనీ దస్తావేజులు సీబీఐ, ఈడీకి అందజేయడానికి అంగీకరించింది. ఈ పత్రాల్లోనే రాఫేల్ డీల్‌లోని ముడుపుల విషయం ఉన్నదని తెలిపింది.

2018 అక్టోబర్ 11న ఈ డాక్యుమెంట్లు దర్యాప్తు సంస్థలకు అందాయని, కానీ, 4వ తేదీనే రాఫేల్ డీల్‌లో అవినీతికి సంబంధించి ఓ ఫిర్యాదు సీబీఐకి అందింది. అయినప్పటికీ సీబీఐ ఈ ఆరోపణలను విచారించాలని నిర్ణయించుకోలేదని మీడియాపార్ట్ తెలిపింది.

దసో సంస్థ నుంచి ఈ ముడుపులను సుషేన్ గుప్తా మరింత రహస్య మార్గాల్లో సేకరించాడు. సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఫర్ దసో ఇన్ ఏషియాగా చిత్రించిన సింగపూర్‌లోని ‘ఇంటర్‌డివ్’ నుంచి ఐటీ సర్వీసులు పొందినట్టు నకిలీ ఇన్వాయిస్‌లో అత్యధిక బిల్లులను దసో చెల్లించింది. నిజానికి ఈ సంస్థ ఉనికిలో లేదు. ఇదొక షెల్ కంపెనీ. గుప్తా కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ షెల్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈ నకిలీ ఇన్వాయిస్‌లపై సుషేన్ గుప్తా కంపెనీ ఇర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ 2007 నుంచి 2012 మధ్య కాలంలో ఐటీ కాంట్రాక్టుల పేరిట రూ. 65 కోట్లు పొందినట్టు ఆధారాలు వెల్లడిస్తున్నాయని మీడియాపార్ట్ తెలిపింది. కొన్ని ఇన్వాయిస్‌లలో దసో పేరు స్పెల్లింగ్ మిస్టేక్‌తో ఉన్నాయని వివరించింది. 

బిడ్డింగ్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఈ ముడుపులు ముట్టాయి. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ డీల్‌ను ఖరారు చేసింది. 

2015 నుంచి జరిగిన అవినీతి ఆరోపణలతో సీబీఐకి ఫిర్యాదు అందింది.

Also Read: రాఫెల్ విమానాల డీల్ కేంద్రానికి ఊరట: టైమ్ లైన్...

రాఫేల్ డీల్ ఖరారు జరుగుతున్న సమయంలోనూ అంటే 2015లోనూ భారత రక్షణ శాఖ యుద్ధ విమానాల ధరను వేటి ఆధారంగా లెక్కిస్తుందనేది, భారత నెగోషియేటర్ల తుది వైఖరి ఏమిటి అనే అత్యంత రహస్య డాక్యుమెంట్లూ సుషేన్ గుప్తాకు అందినట్టు సీబీఐ, ఈడీలకు అందిన రిపోర్టులు వెల్లడిస్తున్నాయని మీడియాపార్ట్ పేర్కొంది. 

ఈడీకి అందిన ఓ డాక్యుమెంట్లో సుషేన్ గుప్తా సంచలన వ్యాఖ్యలూ ఉన్నట్టు మీడియాపార్ట్ పేర్కొంది. దాని ప్రకారం, దసో సంస్థ తరఫున తాను కొంత మంది అధికారులకు సొమ్ము చెల్లించినట్టు సుషేన్ గుప్తా తెలిపారు. ఈ రిస్క్ తీసుకున్నామని, అధికారులకున్న ఓ ఏజెంట్‌కు కొంత మొత్తంలో డబ్బు చెల్లించినట్టు పేర్కొన్నారు. ఇకపై ఈ డీల్‌లో పారదర్శకంగా జరిగిందని, ఇందులో తప్పేమీ లేదని చూడాల్సిన బాధ్యత వారిదేనని చెప్పారు. నో మనీ.. నో డెసిషన్స్. ఆఫీసులో కూర్చున్న కొందరు డబ్బు ఏదని అడుగుతారని పేర్కొన్నారు. వారికి చెల్లించకుంటే తమను జైలులో పెడతారని వివరించినట్టు ఆ డాక్యుమెంట్లు చెబుతున్నాయని మీడియాపార్ట్ వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios