Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం.. రెండు వారాలక్రితం తప్పిపోయి, మృతదేహంగా లభ్యం..

ఆగస్టు 5న ఢిల్లీలోని సెంట్రల్ హోమ్ నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. చివరికి మృతదేహంగా లభ్యమయ్యింది. బాలిక కనిపించకుండా పోయిన రోజే ఆమె తండ్రి ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

eight years old girl missing for two weeks found dead in delhi
Author
hyderabad, First Published Aug 22, 2022, 10:22 AM IST

న్యూఢిల్లీ : రెండు వారాల క్రితం తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలిక మృతదేహం న్యూఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతానికి సమీపంలో లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఆగస్టు 5న ఢిల్లీలోని సెంట్రల్ హోమ్ నుంచి బాలిక కనిపించకుండా పోయిందని, అదే రోజు ఆమె తండ్రి ఫిర్యాదు చేశారని వారు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 18న సమీప అటవీ ప్రాంతంలో మృతదేహం దొరికింది. దీనిమీద కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశామని, ఆమెపై అత్యాచారం జరిగిందో లేదో నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, బాలిక గొంతు కోసినట్లు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని కూడా అనుమానిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

కుమార్తె దురుసు ప్రవర్తన.. తలదించుకున్న మిజోరాం ముఖ్యమంత్రి.. బహిరంగ క్షమాపణ చెబుతూ ట్వీట్..

బాలికను కిడ్నాప్ చేసి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి దాడి చేశారని, ఆ తరువాత, ఆమె మృతదేహాన్ని నది ఒడ్డున పడేశారని అధికారి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డిప్యూటీ కమీషన్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 20న ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆరు, తొమ్మిది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు కిడ్నాప్ అయ్యారు. వారిని ఒక యువకుడు అపహరించాడు. ఆ ఇద్దరు బాలికల్లో ఒకరిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. తొమ్మిదేళ్ల బాలిక బట్టలపై రక్తపు మరకలతో పొలంలో శవమై కనిపించింది. ఇంకో బాలిక ఎలాగోలా తప్పించుకుంది. అని పోలీసులు తెలిపారు.

నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) మునిరాజ్ జి మాట్లాడుతూ బాలికల గ్రామంలోనే నిందితుడు ఉంటాడు.ఆ యువకుడు గురువారం బాలికలిద్దరినీ సైకిల్‌పై సవారీకి తీసుకెళ్లాడు. ఆతరువాత వారు కనిపించకుండా పోయారు. బాలికలిద్దరూ బంధువులవుతారు. వారు కనిపించకుండా పోయారని కుటుంబసభ్యులు గుర్తించి.. వెంటనే పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం పొలంలో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలిక దుస్తుల మీద రక్తపు మరకలు ఉన్నాయని, నిందితుడు నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios