India Pakistan Tensions: ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించింది. అతను తన అధికారిక హోదాకు తగని కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఈ చర్య తీసుకుంది. వెంటనే దేశం విడిచిపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

India Pakistan Tensions: ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించి 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. ఈషాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే ఈ అధికారి ఐఎస్ఐ గూఢచారి అనీ, దౌత్యవేషంలో గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలిసింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్‌కు మంగళవారం అధికారికంగా ఈ విషయం తెలియజేసింది. భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసి, ఆ అధికారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

“ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించింది. అతను తన అధికారిక హోదాకు తగని కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఈ చర్య తీసుకుంది. ఆ అధికారి 24 గంటల్లో భారతదేశం విడిచి వెళ్ళాలని ఆదేశించారు. ఈ మేరకు పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్‌కు మంగళవారం అధికారికంగా ఈ విషయం తెలియజేశారు” అని MEA విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కశ్మీర్ అంశం భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక అంశమని MEA పునరుద్ఘాటించింది.