షోపియాన్ లో ఎన్ కౌంటర్.. కాశ్మీర్ పండిత్ హత్య కేసులో ఉగ్రవాది సహా మరొకరు హతం..
జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ లో మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో ఒకరికి కాశ్మీర్ పండిత్ సంజయ్ శర్మ హత్య కేసులో ప్రమేయం ఉంది.

జమ్మూకాశ్మీర్ షోపియాన్ లోని అల్షిపొరా ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన మొరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూక్ అబ్రార్ గా గుర్తించారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. అయితే ఇందులో అబ్రార్ కు 2023 ఫిబ్రవరిలో పుల్వామాలో కాల్చి చంపిన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో ప్రమేయం ఉందని కాశ్మీర్ పోలీసులు నిర్ధారించారు.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మొదటి సారిగా అత్యాచార బాధితురాలి కుమారుడికి నష్టపరిహారం
బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న శర్మ మార్కెట్ కు వెళ్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. శర్మ హత్య జరిగిన కొద్ది రోజులకే పుల్వామా జిల్లా పడ్గంపోరా గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. అందులో కూడా శర్మ హత్యలో పాలుపంచుకున్న ముస్తాక్ భట్ అనే వ్యక్తి హతమయ్యాడు.
అయితే హతమైన ఉగ్రవాదిని పుల్వామా (ఏ కేటగిరీ)కు చెందిన అఖిబ్ ముస్తాక్ భట్ గా గుర్తించారు. తొలుత హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో పనిచేసిన అతడు తరువాత రెసిస్టెన్స్ ఫ్రంట్ లో పనిచేస్తుచేశాడని, అతడు సంజయ్ శర్మ హత్యలో నిందితుడు అని జమ్మూకాశ్మీర్ పోలీసులు ఆ సమయంలో ట్వీట్ చేశారు.
నెరవేరిన లతా మంగేష్కర్ చివరి కోరిక.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన కుటుంబం..
కాగా.. గతవారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలోని కలకోట్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అక్టోబర్ 1న ఈ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనంతరం గత సోమవారం సాయంత్రం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
క్రికెట్ చూస్తుండగా.. పేలిన ఫ్రిజ్డ్.. ఐదుగురు మృత్యువాత..
అనుమానాస్పద కదలికల సమాచారంతో సైన్యం, జమ్ముకాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం సోమవారం కలకోట్ లోని జనరల్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. బందోబస్తును భగ్నం చేసే ప్రయత్నంలో ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారని, ఫలితంగా ఎదురుకాల్పులు జరిగాయని ఆ సమయంలో అధికారులు పేర్కొన్నారు.