వ్యవసాయ రంగంలోనూ లింగ న్యాయం జరగాలి - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విత్తనాలు నాటిన దగ్గర నుంచి పంట పండేదాక వ్యవసాయ రంగంలో మహిళ పాత్ర ఎంతో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతీ గింజ పొలంలో నుంచి కంచంలోకి వచ్చేంత వరకు మహిళలదే కీలక పాత్ర అయినప్పటికీ వారికి సరైన గుర్తింపు దక్కడం లేదని తెలిపారు.

వ్యవసాయ రంగంలో ప్రపంచ లింగ న్యాయం జరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లింగ న్యాయం విషయంలో వ్యవసాయ రంగానికి ఎంతో సంబంధం ఉందని చెప్పారు. ధాన్యం పొలం నుంచి మనం తినే కంచంలోకి వచ్చే వరకు మహిళల ప్రమేయం ఉంటున్నా.. వారికి సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్-పాలస్తీనాకు మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం.. 1,600 మంది మృతి..
కన్సార్టియం ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ (సీజీఐఏఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) సంయుక్తంగా నిర్వహించిన ‘పరిశోధన నుండి ప్రభావం వైపు: న్యాయమైన, స్థితిస్థాపక వ్యవసాయ-ఆహార వ్యవస్థల వైపు’ అనే అంశంపై న్యూఢిల్లీలో నాలుగు రోజుల గ్లోబల్ సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయమైన, స్థితిస్థాపక వ్యవసాయ ఆహార వ్యవస్థలను సాధించడానికి వివక్షాపూరిత సామాజిక నిబంధనలను తొలగించాలని నొక్కి చెప్పారు.
గాజా సరిహద్దుపై పట్టు సాధించిన ఇజ్రాయెల్.. 1500 మంది హమాస్ దళాల మృతదేహాలు లభ్యం
‘‘మహిళలు విత్తనాలు నాటుతారు. పండిస్తారు. ధాన్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. అలాగే మార్కెంటింగ్ చేస్తారు. ప్రతీ గింజ పొలం నుంచి కంచంలోకి చేరవేయడంలో వారి పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఇప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా, వివక్షాపూరిత సామాజిక నిబంధనలు, జ్ఞానం, యాజమాన్యం, ఆస్తులు, వనరులు, సామాజిక అవరోధాల వల్ల వారి సహకారానికి గుర్తింపు లభించలేదు. వారి పాత్ర అణచివేయతకు గురయ్యింది. వ్యవసాయ-ఆహార వ్యవస్థల మొత్తం గొలుసులో పాత్రకు గుర్తింపు దక్కలేదు. ఈ కథ మారాలి’’ అని అన్నారు.
షోపియాన్ లో ఎన్ కౌంటర్.. కాశ్మీర్ పండిత్ హత్య కేసులో ఉగ్రవాది సహా మరొకరు హతం..
ఇటీవల ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును పరోక్షంగా రాష్ట్రపతి ముర్ము ప్రస్తావిస్తూ.. శాసన, ప్రభుత్వ జోక్యాల ద్వారా మహిళలు మరింత సాధికారత పొందడంతో భారతదేశం కొన్ని మార్పులను చూస్తోందని అన్నారు. ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. 2011 జనాభా లెక్కల ప్రకారం 55 శాతం మంది మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా, 24 శాతం మంది వ్యవసాయదారులు ఉన్నారు. అయితే కేవలం 12.8 శాతం మాత్రమే మహిళల ఆధీనంలో ఉండటం వ్యవసాయంలో భూస్వామ్యాల యాజమాన్యంలో లింగ అసమానతను ప్రతిబింబిస్తోంది.