ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసు అధికారి ఓ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. వివరాల్లోకి వెళితే.. గౌరవ్ ఉపాధ్యాయ్‌ అస్సాం రాష్ట్రంలోని కర్బీఅంగ్‌ లాంగ్ పట్టణంలో సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా పనిచేస్తున్నాడు.

Also Read:కాళ్లూ చేతులూ కట్టేసి...: ప్రేయసిని రేప్ చేసి చంపేశాడు

2012 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా ఉన్న ఆయన 2019 జనవరి నుంచి గౌరవ్ కర్బీఅంగ్‌లాంగ్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గౌరవ్ ఉపాధ్యాయ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఓ బాలిక ఫిర్యాదు చేయడం కలకలం రేగింది.

దీంతో ఆయనపై పోస్కో చట్టం సెక్షన్‌ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే న్యూఇయర్ వేడుకల నిమిత్తం డిసెంబర్ 31న ఆయన నివాసంలో పార్టీని ఏర్పాటు చేశారు.

Also Read:తెలంగాణలో మరో ఘోరం: వివాహితపై గ్యాంగ్ రేప్, హత్య

ఈ పార్టీకి ఓ మహిళా పోలీస్ అధికారి తన 13 ఏళ్ల కుమార్తెను తీసుకొచ్చారు. ఆ బాలికపై కన్నేసిన గౌరవ్ ఉపాధ్యాయ్... ఆమెను బలవంతంగా రూమ్‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేశారు.