Asianet News TeluguAsianet News Telugu

బ్రిడ్జిపై నుంచి బోల్తా పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

జార్ఖండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వాహనం అందుపుతప్పి  బ్రిడ్రిపై నుంచి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

Car overturned from the bridge.. Five members of the same family died..ISR
Author
First Published Oct 24, 2023, 3:08 PM IST

జార్ఖండ్ లోని దేవ్ఘర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

మణిపూర్ హింసాకాండలో తీవ్రవాదుల ప్రమేయం ఉందా ? - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

డియోఘర్ శరత్ లోని అసన్సోల్ సంకుల్ గ్రామానికి చెందిన ఇంజనీర్ ముఖేష్ రాయ్ (30), అతడి భార్య లవ్లీ కుమారి (27), బావ రోషన్ చౌదరి (23), ఓ బాలుడు, ఏడాదిన్నర బాలిక, మరి కొందరితో కలిసి కారులో మంగళవారం గిరిదిహ్ కు వెళ్తున్నారు. కొంత సమయం తరువాత ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు సెల్ఫీలు తీసుకునేందుకు వాహనాన్ని నడిపారు.

ఈ క్రమంలో ఆ వాహనం సిక్తియా బ్యారేజీపై ఉన్న వంతెన వద్దకు చేరుకొని అదుపుతప్పి పడిపోయింది. దీంతో కారు నడిపిన వ్యక్తికి గాయాలు అయ్యాయి. మిగితా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డియోఘర్ ఎస్పీ అజిత్ పీటర్ డుంగ్దుంగ్ తెలిపారు.

బైక్ తో గేదెను ఢీకొట్టాడని.. 16 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన గుంపు..

కాగా.. తమిళనాడులో కూడా మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర ఓ ఆర్టీసీ బస్సు.. సుమోను ఢీ కొట్టింది. సింగం బైపాస్ పై సుమోను.. బస్సు ఢీ కొట్టింది. దీంతో సూమోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలియడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios