బైక్‌ను ఢీకొట్టి.. మూడు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కారు.. బైక్ పైనే ఇద్దరు వ్యక్తులు (Video)

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా బైక్ పై ఇద్దరు వ్యక్తులు ఉండగానే దాన్ని కారు అలాగే కనీసం మూడు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

car drags bike for 3 kms on nagpur road, two bikers survived kms

ముంబయి: మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాగ్‌పూర్‌లో ఓ రద్దీ రోడ్డుపై ముందున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. అంతటితో ఆ కారు ఆగిపోలేదు. ఇద్దరు వ్యక్తులు ఆ బైక్ పై ఉండగానే.. బైక్‌ను అలాగే ముందుకు ఈడ్చుకెళ్లింది. ఏకంగా మూడు కిలోమీటర్ల మేరకు బైక్‌ను కారు అలాగే ఈడ్చుకెళ్లిన ఘటనను వెనుకే ప్రయాణిస్తున్న మరికొందరు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఘటన రాజీవ్ నగర్ ఏరియాలో వార్దా రోడ్డుపై చోటుచేసుకుంది. ఈ రోడ్డు నాగ్ పూర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లుతుంది. వేగంగా వెళ్లుతున్న కారు ఎదురుగా ఉన్న బైక్‌ను ప్రైడ్ హోటల్ సమీపంలో ఢీకొట్టింది. కారును ఆపకుండా.. డ్రైవర్ అలాగే ముందు పడిపోయి ఉన్న బైక్‌ను ఈడ్చుకుంటూ నడిపాడు. బైక్ పై ఉన్న ఆ ఇద్దరు మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారు. మొత్తంగా ప్రాణాలను దక్కించుకున్నారు. వారిని హాస్పిటల్‌లో చేర్చారు.

Also Read: మనుషుల్ని నగ్నంగా చూడొచ్చని... మ్యాజిక్ మిర్రర్ పేరుతో వృద్ధుడికి టోకరా..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితులను రాకేశ్ గాటే, ఆకాశ్ టేకంలుగా గుర్తించారు. వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఓ హాస్పిటల్‌లో చేర్చినట్టు వివరించారు. 

గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు సోనేగావ్ పోలీసు స్టేషన్ అధికారులు చెప్పారు. వారి కోసం గాలింపులు జరుపుతున్నామని, కారును గుర్తించే పనిలో ఉన్నట్టు వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios