Asianet News TeluguAsianet News Telugu

గర్భాశయ చికిత్స కోసం వెళితే రెండు కిడ్నీలు కాజేసి వైద్యులు పరార్.. డాక్టర్ల రూపంలో బిహార్ దొంగలు

బిహార్‌లో ఓ మహిళ గర్భాశయంలో ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో చేరితే.. వైద్యులు ఆమె రెండు కిడ్నీలను తొలగించారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో మరో హాస్పిటల్‌లో చేర్పించి కిడ్నీలతో పారిపోయారు. భర్త కూడా వదిలిపెట్టి వెళ్లిపోయాడు. వారికి ముగ్గురు పిల్లల సంతానం ఉన్నది.
 

came with uterus ifection, doctor stoles her both kidney and fled in bihar
Author
First Published Jan 30, 2023, 4:37 PM IST

న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ మహిళ గర్భాశయ చికిత్స కోసం ఓ నర్సింగ్ హోం వెళ్లింది. అక్కడే దొంగలు వైద్యుల అవతారం ఎత్తారు. గర్భాశయానికి చికిత్స చేస్తున్నట్టు నటించి ఏకంగా ఆమె రెండు కిడ్నీలను దొంగిలించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి పరారయ్యారు.

ముజఫర్‌పూర్ బరియార్‌పూర్ చౌక్ సమీపంలోని శుభ్‌కాంత్ క్లినిక్‌లో దొంగలు వైద్యులుగా రెడీ అయ్యారు. తనకు గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నదని చెప్పి అందులో చేరగానే. వారు సెప్టెంబర్ 3వ తేదీన కిడ్నీలు దొంగిలించారు. ఆమె ఆరోగ్యం దారుణంగా క్షీణిస్తుండటంతో డాక్టర్, క్లినిక్ డైరెక్టర్ పవన్ ఆమెను పాట్నాలోని ఓ నర్సింగ్ హోమ్‌లో చేర్చి పారిపోయాడు. పోలీసులు పవన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.

సునీత గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడంతో చికిత్స కోసం ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. డాక్టర్లు ఆమె నుంచి రెండు కిడ్నీలు తొలగించి, వాటిని పట్టుకుని చెక్కేశారు. ఇప్పుడు సునీత.. జిల్లాలోని ఎస్‌కే మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తున్నది. ప్రతి రెండు రోజులకు ఒక సారి డయాలసిస్ చేసుకోవాల్సి వ్తున్నది. కిడ్నీ దానం చేయడానికి పలువురు ముందుకు వస్తున్నారు. కానీ, ఆమెకు కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. హాస్పిటల్ కూడా ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా.. మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరకడం లేదు.

Also Read: లాలు యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్.. నాన్న, అక్క ఇద్దరూ క్షేమం: తేజస్వీ యాదవ్

కొన్ని రోజుల క్రితం వరకూ సునీతతో ఆమె భర్త అక్లు రామ్ తోడు ఉండేవారు. అతను కూడా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు. కానీ, ఆమెకు ఆ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. ఇటీవలే కొన్ని విషయాలపై దంపతులకు వాగ్వాదం జరిగింది. దీంతో భార్యను దుర్భర స్థితిలోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ముగ్గురు పిల్లలను భార్య వద్దే వదిలి.. ఇక తనకు భార్యతో సంబంధం లేదని, చచ్చినా, బ్రతికినా తనకు అవసరం లేదని గొడవపెట్టుకుని వెళ్లిపోయాడు. మళ్లీ ఆమెతో కలిసి జీవించాలని భావించడం లేదని చెప్పడంతో అతను మరో మహిళను పెళ్లి చేసుకుంటాడా? అనే భయంలోనూ ఆమె ఉన్నది.

గతంలో నేను కూలి పని చేసేదాన్ని, అప్పుడు ఆరోగ్యంగా ఉండి కుటుంబాన్ని చూసుకున్నానని ఆమె వివరించింది. ఇప్పుడు తన ఆరోగ్యం బాగా లేదని ఈ కష్ట పరిస్థితుల్లో నీతో జీవించలేను అని అతను చెప్పి వెళ్లిపోయాడని, తాను చచ్చినా.. బతికినా తనకు అవసరం లేదని వెళ్లిపోయాడని ఆమె రోధిస్తూ తెలిపింది. ‘నాకు ముగ్గురు పిల్లలున్నారు. నా భర్త వారిని నాతోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఇప్పుడు నేను హాస్పిటల్‌లో ఉన్నాను. చావు కోసం రోజులు లెక్కపెడుతున్నా. నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో కూడా నాకు తెలియదు. ఇందులో నేను చేసిన తప్పు ఏం ఉన్నది? నా మరణం తర్వాత పిల్లలు ఎలా ఉంటారో? వాళ్లు ఎలా బ్రతకాలి?’ అంటూ ప్రశ్నలతో సతమతం అవుతున్నది.

ముజఫర్ పూర్ జిల్లాకు చెందిన సునీత దినసరి కూలీ. రోజూ పనికి వెళ్లి తన ముగ్గురు పిల్లలను పెంచుతున్నది. ఇప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ కావడంతో పని చేయకపోవడంతోపాటు ఆమె ఆరోగ్యం గురించి, పిల్లల భవిష్యత్ గురించి బెంగ పెట్టుకుంది.

హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆమె తల్లి తోడుగా ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios