Asianet News TeluguAsianet News Telugu

లాలు యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్.. నాన్న, అక్క ఇద్దరూ క్షేమం: తేజస్వీ యాదవ్

లాలు ప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. తన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని డొనేట్ చేసింది. ఈ రోజు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. వీరిద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని లాలు యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ వెల్లడించారు.
 

kidney transplant operation to lalu prasad yadav successfull says son tejshwi yadav
Author
First Published Dec 5, 2022, 4:03 PM IST

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. లాలు ప్రసాద్ యాదవ్‌కు సింగపూర్‌లోని ఓ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడీ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని బిహార్ డిప్యూటీ సీఎం, లాలు ప్రసాద్ యాదవ్ చిన్న కొడుకు తేజస్వీ యాదవ్ తెలిపారు. తన తండ్రి, సోదరి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు.

లాలు ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ దానం చేయడానికి ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య ముందుకు వచ్చారు. ఆమె రెండు కిడ్నీలలో ఒకదాన్ని తండ్రి లాలు ప్రసాద్ యాదవ్‌కు ట్రాన్స్‌ప్లాట్ చేశారు.

రోహిణి ఆచార్య ఇందుకు సంబంధించి సర్జీరికి ముందు ఓ ఫొటో ట్వీట్ చేశారు. రాక్ అండ్ రోల్‌కు తాను సిద్ధంగా ఉన్నారని రోహిణీ ఆచార్య తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేశారు. తనకు విష్ చేయాలని పేర్కొన్నారు. సర్జరీ కంటే ముందే ఆమె బెడ్ పై తన ఫొటోను, అలాగే, తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

Also Read: Tejashwi Yadav: 'మా ఇంట్లోనే సీబీఐ-ఈడీలు త‌మ‌ కార్యాల‌యాల‌ను పెట్టుకోవ‌చ్చు'

కిడ్నీ సంబంధ సమస్యలతో సతమతం అవుతున్న లాలు ప్రసాద్ యాదవ్‌ను కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత తాను తన తండ్రికి కిడ్నీ డొనేట్ చేస్తా అని రోహిణి ఆచార్య ఆంగ్ల మీడియా ఎన్డీటీవీకి కన్ఫామ్ చేశారు. ఆమె తరుచూ తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు తనకు దేవుళ్లని పేర్కొంది. తాను తన బాడీలో ఓ కొద్ది భాగం మాంసం తండ్రికి ఇస్తున్నా అని ఆమె ఇటీవలే పేర్కొంది.

సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో ఆ తర్వాతి పరిణామాన్ని లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు, రాజ్యసభ ఎంపీ మీసా భారతి ట్వీట్ చేశారు. డోనర్ రోహిణీ సింగ్ ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఇప్పుడు తన తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నదని అనంతరం ట్వీట్ చేశారు. తన చెల్లి రోహిణి ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఆమెను ఇప్పుడు ఐసీయూలో ఉంచారని వివరించారు.

ఆపరేషన్ పూర్తయిన తర్వాత చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. తండ్రి ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఆ తర్వాత అతడిని ఐసీయూకి తరలించారని వివరించారు. కిడ్నీ డోనర్ రోహిణీ ఆచార్య, పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వీరికోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios