Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ సంక్షోభం: సిద్ధూకి బుజ్జగింపులు.. స్వయంగా ఫోన్ చేసిన సీఎం చరణ్‌జిత్ సింగ్

పంజాబ్‌ కాంగ్రెస్‌లో వివాదం నానాటికీ పెరిగిపోతోంది. పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడం ఆయనకు మద్ధతుగా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సైతం తప్పుకోవడంతో వివాదం నెలకొంది. హాట్ టాపిక్‌గా మారిన సిద్ధూ-కెప్టెన్ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందించారు

called siddhu and asked him to talk it over says punjab cm channi
Author
Chandigarh, First Published Sep 29, 2021, 5:14 PM IST

పంజాబ్‌ కాంగ్రెస్‌లో వివాదం నానాటికీ పెరిగిపోతోంది. పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడం ఆయనకు మద్ధతుగా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సైతం తప్పుకోవడంతో వివాదం నెలకొంది. హాట్ టాపిక్‌గా మారిన సిద్ధూ-కెప్టెన్ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందించారు. తాను సిద్ధూకి ఫోన్ చేసినట్లు చెప్పారు. ‘‘పార్టీ చీఫ్ ఎవరైనా సరే, ఆయన కుటుంబ పెద్ద వంటి వాడని సీఎం అన్నారు. అందుకే తాను సిద్ధూకు ఫోన్ చేశానని... కూర్చొని మాట్లాడుకుందామని, సమస్యను పరిష్కరించుకుందామని చెప్పా అని చన్నీ పేర్కొన్నారు.

ALso Read:Punjab Crisis : ‘అప్పుడు టీమిండియాను మధ్యలో వదిలేశాడు, ఇప్పుడు...’ సిద్ధూపై అమరీందర్ ఘాటు వ్యాఖ్యలు..

ఇక రాష్ట్ర సమస్యలపై స్పందిస్తూ, తాను రెగ్యులర్‌గా గ్రామాల్లో పర్యటిస్తున్నానని, అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రధాన సమస్యగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. భారీగా ఉన్న బిల్లులు కట్టకపోవడంతో చాలా ఇళ్లలో మీటర్లు కూడా తొలగించారని చన్నీ తెలిపారు. కాంగ్రెస్‌లో సిద్ధూ వర్గానికి చన్నీ సన్నిహితుడనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్యపై కూడా చన్నీ స్పందించారు. రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టలేని 53 లక్షల కుటుంబాల బాధ్యతను తాము తీసుకుంటామని వెల్లడించారు. వీరిలో 75-80 శాతం మంది 2కేడబ్ల్యూ కేటగిరీలోకి వస్తారని, వీరి చివరి బిల్లులను తాము చూసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బిల్లులు కట్టలేదని తొలగించిన కనెక్షన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని చన్నీ తెలిపారు
 

Follow Us:
Download App:
  • android
  • ios