Asianet News TeluguAsianet News Telugu

యూపీలో బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి, 30 మందికి గాయాలు..

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 75 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. 30 మందికి గాయాలయ్యాయి. 

Bus overturns in UP.. 2 students killed, 30 injured..
Author
First Published Dec 17, 2022, 5:15 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా హాండియా టౌన్‌షిప్‌లోని సైదాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం 75 మంది పిల్లలతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. 30 మంది గాయపడ్డారు. జౌన్‌పూర్‌లోని కాంతి దేవి జనతా విద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం ఓ బస్సులో ప్రతాప్‌గఢ్‌లోని మాన్‌గర్ ధామ్‌, అలాగే ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్‌కు పర్యటన కోసం బయలుదేరింది.

భార్యతో గొడవపడి.. రెండేళ్ల చిన్నారిని భవనంపై నుంచి తోసేసి.. ఆపై అతడు కూడా ..

అయితే బస్సు 10 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్-వారణాసి హైవేపై హాండియాలో ప్రాంతానికి చేరుకుంది. భేస్కీ గ్రామానికి వచ్చే సరికి ఒక్క సారిగా ఎదురుగా ఓ బైక్ వచ్చింది. దీంతో వారిని తప్పించే ప్రయత్నంలో బస్సు కంట్రోల్ తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఉలిక్కిపడ్డ విద్యార్థులు సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో స్థానికులు, భేస్కీ గ్రామస్తులు అక్కడికి చేరుకొని బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. ఈ ఘటనలో గాయపడిన 27 మంది విద్యార్థులను సమీపంలోని హండియా టౌన్‌షిప్‌లోని దేవరాజ్ ఆసుపత్రికి తరలించారు.

"టాప్ సీక్రెట్": గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అరెస్టుపై సీఎం భగవంత్ మాన్

అయితే ఘోరహన్‌ కు చెందిన 9వ తరగతి విద్యార్థి అంకిత్‌ కుమార్‌, భారతీపూర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి అనురాగ్‌లు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గంగా నగర్ డీసీపీ అభిషేక్ అగర్వాల్‌తో పాటు సీనియర్ పోలీసు అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్ సీ)లో చేర్పించారు ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వారిని కూడా హాస్పిటల్ కు తరలించారు.

ముంబైలోని ఘట్కోపర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 22 మందికి గాయలు.. ఘటనా స్థలానికి చేరుకున్న 8 ఫైర్ ఇంజన్లు..

 ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. “ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడిన వారిని సమీపంలోని సీహెచ్ సీలో చేర్పించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కచ్చితమైన మరణాల సంఖ్య కొంత సమయం తరువాత తెలుస్తుంది ’’ అని డీసీపీ అగర్వాల్ అన్నారు.

జగన్నాథ ఆలయానికి రూ. లక్ష విరాళమిచ్చిన 70 ఏళ్ల యాచకురాలు.. ఎక్కడంటే ?

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బస్సులో 40 మంది బాలురు, 35 మంది బాలికలు ఉన్నారు. ఏడుగురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అయితే బస్సులో 41 మందికి మాత్రమే ప్రయాణ సామర్థ్యం ఉంది. ప్రమాద సమయంలో బస్సు అధికవేగంలో ఉందని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios