Asianet News TeluguAsianet News Telugu

భార్యతో గొడవపడి.. రెండేళ్ల చిన్నారిని భవనంపై నుంచి తోసేసి.. ఆపై అతడు కూడా .. 

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్ష‌ణికావేశంలో తన రెండేళ్ల చిన్నారిని మొదటి అంతస్తు నుండి విసిరి, ఆపై భవనం మూడవ అంతస్తు నుండి దూకాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

Delhi man throws 2-year-old son off building after tiff with wife, then jumps
Author
First Published Dec 17, 2022, 5:03 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి  క్ష‌ణికావేశంలో అభంశుభం తెలియ‌ని తన రెండేళ్ల కొడుకును మొదటి అంతస్తు నుంచి కిందకు విసిరివేశాడు. ఆ తర్వాత నిందితుడు కూడా మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలో ఆస్పతికి తరలించారు.

వారి పరిస్థితి విషమంగా మారడంతో AIIMS ట్రామా సెంటర్‌కు తరలించారు. ఘటన ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో చోటుచేసుంది. అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 16 తేదీ రాత్రి 10.38 గంటల సమయంలో ఓ వ్యక్తి కోపంతో తన చిన్నారిని మెడపై నుంచి కింద పడేసి.. ఆ తరువాత తన కూడా ఇంటి పైనుండి దూకినట్లు పోలీస్ స్టేషన్ కల్కాజీలో ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

నిందితుడు మాన్ సింగ్ (30)సంవత్సరాలు. తన మైనర్ కొడుకు (2 సంవత్సరాలు)ని దాదాపు 21 అడుగుల ఎత్తు నుంచి కింద పడేశాడు. ఆ తరువాత అతడు కూడా టెర్రస్ నుండి కిందకు దూకినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేర్చారు. బాధిత చిన్నారి, నిందితుడు మాన్ సింగ్ చికిత్స పొందుతున్నారు.

నిత్యం భార్యభర్తల మధ్య వాగ్వివాదాలు జరగడం, తాగి వచ్చి నిందితుడు తన భార్యను కొట్టడం చేసే వాడని. దీంతో అతని భార్య పూజ తన ఇద్దరు పిల్లలతో కలిసి గత కొన్ని రోజులుగా ఇంట్లోనే నివసిస్తుందని స్థానికులు తెలిపారు. ఆమె భర్త సాయంత్రం తన భార్య ఉంటున్న ఇంటికి వచ్చి..ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో ఇరువురి మధ్య గొడవ తీవ్రమైంది. దీంతో క్షణికావేశంలో ఆ వ్యక్తి తన కన్నకొడుకు అనే ఇంగితం మరిచి.. తన కుమారుడిని మొదటి అంతస్తులోని టెర్రస్‌పైకి తీసుకెళ్లి కింద పడేశాడు. ఆ తర్వాత అతడు కూడా కిందకు దూకాడు. పోలీసులు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios