Asianet News TeluguAsianet News Telugu

ముంబైలోని ఘట్కోపర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 22 మందికి గాయలు.. ఘటనా స్థలానికి చేరుకున్న 8 ఫైర్ ఇంజన్లు..

ముంబాయిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. మంటలను ఆర్పేందుకు 8 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

Fire in Ghatkopar, Mumbai.. 22 people injured.. 8 fire engines reached the scene..
Author
First Published Dec 17, 2022, 4:18 PM IST

ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరేఖ్ ఆసుపత్రి సమీపంలో ఇది చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

జగన్నాథ ఆలయానికి రూ. లక్ష విరాళమిచ్చిన 70 ఏళ్ల యాచకురాలు.. ఎక్కడంటే ?

విశ్వాస్ భవనంలో ఉన్న జూనోస్ పిజ్జా రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయని ముంబై ఫైర్ సర్వీస్ తెలిపింది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. కానీ 22 మందికి గాయలు అయ్యాయని, వారిని పరాఖ్ హాస్పిటల్ లో చేర్చామని తెలిపింది.

బీహార్‌లో కల్తీ మద్యం విధ్వంసం.. 70 మందికి పైగా మృత్యువాత !

ఘట్‌కోపర్ తూర్పు ప్రాంతంలో ఉన్న ఆరు అంతస్తుల ‘విశ్వాస్’ అనే భవనంలోని విద్యుత్ మీటర్ గదిలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయని వార్తా సంస్థ ‘పీటీఐ’ పేర్కొంది. పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపింది. 

సెంట్రల్ ముంబైలోని 61 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న రెండు రోజుల తరువాత ఇది జరిగింది. కర్రీ రోడ్ ప్రాంతంలోని `వన్ అవిఘ్న పార్క్ భవనంలోని 22వ అంతస్తులోని ఫ్లాట్‌లో గురువారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే మూడు గంటల తర్వాత మధ్యాహ్నం అంటే 1.50 గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. 

ఖర్గే ‘రిమోట్ కంట్రోల్’ కాకపోతే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలి - బీజేపీ

ఈ మంటలను ఆర్పేందుకు 10 ఫైర్ ఇంజన్లు శ్రమించాయి. అయితే 2021 అక్టోబర్ నెలలో అదే రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని 19వ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. అయితే మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుతూ 30 ఏళ్ల వయస్సున్న సెక్యూరిటీ గార్డు మరణించాడు. 

అయితే తాజాగా ఘట్కోపర్‌లో సంభవించిన అగ్నిప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...

Follow Us:
Download App:
  • android
  • ios