మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో డివైడర్‌ను ఢీకొని ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 24 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి లింగ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
కరేలీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అఖిలేష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సు ఓ వివాహం కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో అర్థరాత్రి లింగ గ్రామ సమీపంలోకి చేరుకోగానే రోడ్డుపై ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కార్తీక్ గుర్జార్ (16), పహల్వాన్ సారథే (60), ఉదయరామ్ ఠాకూర్ (55) అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వారి మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారని వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది.
అదానీ వివాదం... మీడియాపై ఎలాంటి ఆంక్షలూ విధించబోం - సుప్రీంకోర్టు
ఈ ప్రమాదంలో మొత్తం 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. స్వల్పంగా గాయపడిన మరికొందరు కరేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. అయితే బస్సు రోడ్డుకు రాంగ్ సైడ్‌లో ప్రయాణిస్తున్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్‌స్పెక్టర్ అఖిలేష్ మిశ్రా చెప్పారు.
ఈ ఘటన తరువాత డ్రైవర్ బస్సును వదిలిపెట్టి అక్కడి నుండి పారిపోయాడని, తరువాత బస్సును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బస్సు డ్రైవర్‌పై ర్యాష్ డ్రైవింగ్ సహా ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
ఏ ప్రాంతం, మతం పట్ల పక్షపాతం లేదు.. అందరికీ శాంతి, శ్రేయస్సు కావాలి : ప్రధాని నరేంద్ర మోడీ
గురువారం అర్థరాత్రి ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు పికప్ వ్యాన్ ను ఢీనడంతో 11 మంది మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బలోదబజార్ జిల్లాలోని భాటాపరా వద్ద గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు, పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ఒక్క సారిగా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
గౌహతిలో భారీ అగ్నిప్రమాదం.. 150 ఇళ్లు, పలు వాహనాలు దగ్ధం
అర్జుని ప్రాంతంలో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొని కుటుంబ సభ్యులంతా పికప్ వాహనంలో ప్రయాణం ప్రారంభించారు. అయితే వాహనం భాటాపరా ప్రాంతానికి చేరుకునే సరికి ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వ్యాన్ లో ఉన్న 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్డీఓపీ భటపర సిద్ధార్థ్ బఘేల్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని రాయ్‌పూర్‌కు తరలించారు.
