అదానీ వివాదంలో మీడియాను రిపోర్టింగ్ చేయనివ్వకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలూ విధించలేమని పేర్కొంది.
కోర్టు తీర్పు వెలువరించే వరకు అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై మీడియా రిపోర్టింగ్ చేయకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో మీడియాకు తాము ఎలాంటి ఆంక్షలు విధించబోమని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏ ప్రాంతం, మతం పట్ల పక్షపాతం లేదు.. అందరికీ శాంతి, శ్రేయస్సు కావాలి : ప్రధాని నరేంద్ర మోడీ
“మేము మీడియాకు ఎటువంటి నిషేధాజ్ఞలు జారీ చేయబోము. మేము త్వరలో ఉత్తర్వులు ప్రకటిస్తాము, ”అని ఈ ధర్మాసనంలోని సీజేఐ డీవై చంద్రచూడ్ చెప్పారని బార్ అండ్ బెంచ్ నివేదించింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మోసం ఆరోపణలతో ఇటీవల అదానీ గ్రూప్ షేర్ల పతనంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి ప్రతిపాదిత నిపుణుల కమిటీపై కేంద్రం చేసిన సూచనను సీల్డ్ కవర్ లో అంగీకరించడానికి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న నిరాకరించింది.
పెట్టుబడిదారుల ప్రయోజనాల దృష్ట్యా పూర్తి పారదర్శకత పాటించాలని తాము కోరుకుంటున్నామని, సీల్డ్ కవర్ లో కేంద్రం సూచనను అంగీకరించబోమని తెలిపింది. పూర్తి పారదర్శకత పాటించాలనుకుంటున్నందున సీల్డ్ కవర్ సూచనను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పింది. కాగా.. అదానీ గ్రూప్ స్టాక్ పతనం నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడుకుల నుంచి భారతీయ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, రెగ్యులేటరీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో డొమైన్ నిపుణుల ప్యానెల ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఫిబ్రవరి 10న అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది.
గౌహతిలో భారీ అగ్నిప్రమాదం.. 150 ఇళ్లు, పలు వాహనాలు దగ్ధం
ఇప్పటి వరకు ఈ అంశంపై న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, సామాజిక కార్యకర్త ముఖేష్ కుమార్ సుప్రీంకోర్టులో నాలుగు పిల్ దాఖలు చేశారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్స్ పై మోసపూరిత లావాదేవీలు, షేరు ధరల తారుమారు వంటి ఆరోపణలు చేయడంతో ఆ సంస్థల షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే ఈ ఆరోపణలు అదానీ గ్రూప్ అబద్ధాలుగా కొట్టిపారేసింది. తాము అన్ని చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.
