అస్సాంలోెని గౌహతి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 150 ఇళ్లు కాలిపోయాయి. అనేక వాహనాలు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ ఈ ఘటనకు కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అస్సాం రాష్ట్రం గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలోని అజంతా పథ్ వద్ద గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఈ అగ్నిప్రమాదంలో 150కి పైగా ఇళ్లు దగ్ధం అయ్యాయి. దీంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అనేక వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ మంటల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు.
తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటన.. ఎందుకంటే?
ఓ ఇంటి నుంచి ఈ మంటలు మొదలై అనేక ఇళ్లకు వ్యాపించాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ ఇంకా కచ్చితమైన కారణాలు ఏంటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వీడియోలో దట్టమైన పొగలు ఎగసిపడుతుండటం కనిపిస్తోంది. నిమిషాల్లోనే మంటలు చాలా ఇళ్లకు వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు హెల్టర్ స్కెల్టర్ పరుగెత్తారు. ఈ మంటల వల్ల వాహనాలు కాలిపోవడంతో పాటు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మంటలను ఆర్పేందుకు 15కి పైగా అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. కాగా ఈ ఘటనలో 15కు పైగా సిలిండర్లు పేలిపోయాయని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
రూ. 30ల కోసం వ్యక్తి పై కత్తితో దాడి, హత్య.. ఇద్దరు సోదరులు అరెస్టు
ఇదే రాష్ట్రంలోని జోర్హాట్‌లో ఈ నెల 17వ తేదీన చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 100 కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. మార్కెట్ ప్రధాన గేటుకు సమీపంలో ఉన్న ఓ బట్టల దుకాణం నుంచి మంటలు చెలరేగాయి. క్రమేపీ విస్తరిస్తూ రాత్రి 1 గంట వరకు అనేక దుకాణాలకు వ్యాపించాయి. దీంతో దాదాపు 100 దుకాణాలకు కాలిపోయాయి. ప్రమాదంలో చోటు చేసుకున్న జోర్హాట్ ప్రాంతం ఏటీ రోడ్‌లో చౌక్ బజార్ రోడ్డులో ఉంది. ఇక్కడి ఓ బట్టల దుకాణంలో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో దుకాణదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే అనేక దుకానాలు కాలిపోయాయి. తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి.
